ఆ నిర్మాతకు ఇక నో ఫోన్?

మొబైల్ పోన్ లు వచ్చిన తరువాత మామూలుగా మాట్లాడేది తక్కువ, పోన్ లో మాట్లాడేది ఎక్కువ అయిపోయింది. పైగా ల్యాండ్ లైన్ ఫోన్ లా కాదు మొబైల్. రేడియైషన్ వంటి సమస్యలు వున్నాయి. దీంతో…

మొబైల్ పోన్ లు వచ్చిన తరువాత మామూలుగా మాట్లాడేది తక్కువ, పోన్ లో మాట్లాడేది ఎక్కువ అయిపోయింది. పైగా ల్యాండ్ లైన్ ఫోన్ లా కాదు మొబైల్. రేడియైషన్ వంటి సమస్యలు వున్నాయి. దీంతో ఇప్పుడిప్పుడే జనాలకు ఈ సమస్యలన్నీ అర్థం అవుతున్నాయి. దాంతో ఫోన్ ఎవర్షన్ పెరుగుతోంది.

ఇండస్ట్రీలోని ఓ డిస్ట్రిబ్యూటర్ కమ్ నిర్మాత కమ్ స్టూడియో ఓనర్ కు కూడా ఇప్పుడు ఇదే సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మధ్య చెవి సమస్యలు వచ్చి డాక్టర్లను సంప్రదిస్తే, ఫోన్ ను వదిలేయమని చెప్పినట్లు తెలుస్తోంది. కేవలం ఫోన్ ను వదిలేయడం కాకుండా, మెదడు ఆరోగ్యం రీత్యా మొబైల్ మాట్లాడవద్దని హెచ్చరించినట్లు వినికిడి.

దీంతో ఇప్పుడు ఆయన ఫోన్ మాట్లాడడం లేదట. మరీ మాట్లాడాలి అంటే స్పీకర్ ఆన్ మోడ్ లో పెట్టి మాట్లాడుతున్నారట. లేదూ అంటే ఎవరైనా మాట్లాడుతూ, అటు విషయం ఇటు, విషయం అటు చెపుతున్నారట. ఒకప్పుడు ఇదే నిర్మాత రోజుకు వందలాది ఫోన్ లు మాట్లాడేవారట. ఇప్పుడు సెలెక్టెడ్ గా, అది కూడా స్పీకర్ లో లేదా వేరేవాళ్ల సాయంతో మాట్లాడుతున్నారట. మొబైళ్లతో ఎవరైనా జాగ్రత్తగా వుండాల్సిందే.