ఆ సినిమాకు డమ్మీ డబ్బింగ్

సినిమా తీసిన తరువాత అనుకున్న మాట ప్రకారం పని చేసిన వారికి, నటులకు రెమ్యూనిరేషన్ ఇవ్వాల్సిందే. అది పద్దతి. కానీ టాలీవుడ్ లో ఎగ్గొట్టడం, తగ్గించడం, రేపు, ఎల్లుండి అనడం ఇలాంటి వ్యవహారాలు చాలా…

సినిమా తీసిన తరువాత అనుకున్న మాట ప్రకారం పని చేసిన వారికి, నటులకు రెమ్యూనిరేషన్ ఇవ్వాల్సిందే. అది పద్దతి. కానీ టాలీవుడ్ లో ఎగ్గొట్టడం, తగ్గించడం, రేపు, ఎల్లుండి అనడం ఇలాంటి వ్యవహారాలు చాలా వుంటాయి.

ఉంగరాల రాంబాబు సినిమా విషయంలో హీరో సునీల్ కచ్చితమైన నిర్ణయానికి వచ్చి డబ్బింగ్ ఆపేసాడు. దాంతో సినిమా విడుదల ఆగిపోయింది. సునీల్ అమెరికాకు షూటింగ్ కోసం వెళ్లాడు. అక్కడి నుంచి రావడానికి ఇంకా చాలా టైమ్ పడుతుంది.

ఒకవేళ ఇప్పుడు నిర్మాత పేమెంట్ చేయాలన్నా, డబ్బింగ్ సమస్యే. అయితే ఏదో విధంగా చేయించే అవకాశం వుంది.

కానీ ముందు డబ్బింగ్ అయితే తప్ప, మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వుంటాయి కదా? అందుకే హీరో సునీల్ తో ఏదో ఒక విధమైన ఒప్పందానికి వచ్చారట ఉంగరాల రాంబాబు నిర్మాత.

ఆ మేరకు ముందు డమ్మీ డబ్బింగ్ చెప్పించేసి, మిగిలిన కార్యక్రమాలు అన్నీ ఫినిష్ చేస్తారట. ఆ తరువాత సునీల్ తో డబ్బింగ్ చెప్పిస్తారట. సినిమాను ఈ నెలాఖరులో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు క్రాంతి మాధవ్.

అన్నట్లు ఈ సినిమాకు ప్రకాష్ రాజ్ కూడా డబ్బింగ్ చెప్పలేదు. మరి ఆయనతో ఒప్పందం కుదిరిందో లేదో?