ఆ సినిమాలు ఎప్పుడొస్తాయో?

రెండు సినిమాలు ఒకటి అరి వీర భారీ సినిమా. పేరు భాగమతి. రెండవది పక్కా బుల్లి సినిమా. పేరు కొబ్బరి మట్ట. రెండు సినిమాలు ఏళ్ల తరబడి తయారవుతూనే వున్నాయి. Advertisement సరే కొబ్బరి…

రెండు సినిమాలు ఒకటి అరి వీర భారీ సినిమా. పేరు భాగమతి. రెండవది పక్కా బుల్లి సినిమా. పేరు కొబ్బరి మట్ట. రెండు సినిమాలు ఏళ్ల తరబడి తయారవుతూనే వున్నాయి.

సరే కొబ్బరి మట్ట అంటే జేబులో నాలుగు రూపాయిలు వున్నప్పుడు షూట్ చేస్తున్నారు. లేదు అంటే లేదు. అది ఎప్పుడు వచ్చినా సమస్య కూడా లేదు. కానీ భాగమతి సంగతేమిటి?

యువి క్రియేషన్స్ వంటి భారీ బ్యానర్. కోట్ల రూపాయిల ఖర్చు. అనుష్క లాంటి హీరోయిన్. ఇంత వ్యవహారం వుంది. షూట్ అయితే అయిపోయింది.

ఇన్ని సినిమాల ఫస్ట్ లుక్ లు, టీజర్లు, ట్రయిలర్లు వస్తున్నాయి కానీ, భాగమతి లుక్కు మాత్రం కనిపించడం లేదు. గత నెల 30 న ఫస్ట్ లుక్ అన్న టాక్ వినిపించింది. కానీ మళ్లీ లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయినట్లు తెలుస్తోంది.

డైరక్టర్ అశోక్ అందించిన ఫస్ట్ లుక్ యువి క్రియేషన్స్ కు నచ్చకే లాస్ట్ మినిట్ లో ఆపేసినట్లు తెలుస్తోంది. మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తారో భాగమతికే తెలియాలి.