ఈ సినిమాలు డీజేకి పోటీనిస్తాయా..?

రేపు థియేటర్లలోకి 4 సినిమాలు వస్తున్నాయి. కాకపోతే ఓ 2 సినిమాలు మాత్రం స్టార్ కాస్ట్ తో ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి…

రేపు థియేటర్లలోకి 4 సినిమాలు వస్తున్నాయి. కాకపోతే ఓ 2 సినిమాలు మాత్రం స్టార్ కాస్ట్ తో ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా మారి చేసిన సినిమా జయదేవ్. ఈ మూవీ రేపు థియేటర్లలోకి వస్తోంది. గతంలో పలు సూపర్ హిట్స్ ఇచ్చిన జయంత్ సి.పరాన్జీ ఈ సినిమాకు దర్శకుడు.

జయదేవ్ సినిమాతో పాటు సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన వైరస్ డాట్ కామ్ అనే సినిమా కూడా విడుదలకు ముస్తాబైంది. పేరడీలతో పాపులర్ అయిన సంపూ, వైరస్ ను కూడా సేమ్ టు సేమ్ అలాంటి పేరడీలతోనే నింపేశాడు. ఇక గ్యాంగ్ స్టర్ నయీమ్ జీవితం ఆధారంగా తీసిన ఖయ్యుం భాయ్ సినిమా కూడా రేపు రిలీజ్ అవుతోంది.

వీటితో పాటు ట్రాన్స్ ఫార్మర్స్ ఆఖరి యోధుడు అనే డబ్బింగ్ సినిమా కూడా థియేటర్లలోకి వస్తోంది. ఈ నాలుగు సినిమాలతో ప్రేమలీల-పెళ్లిగోల అనే మరో డబ్బింగ్ సినిమా శనివారం రోజున విడుదలకానుంది. ఇప్పటివరకు చెప్పుకున్న ఈ సినిమాలపై ఎవరికీ ఎలాంటి అంచనాల్లేవ్. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న డీజేకు ఇవి ఎంతమాత్రం పోటీ కావు.