ఆ డైరక్టర్ ఆమెను వదల్లేదు

సినిమాల్లో అంతే ఓ నటి లేదా నటుడు నచ్చితే డైరక్టర్లు ఇక వదులుకోరు. తమ సినిమాల్లో మాంచి పాత్రలు ఇస్తూ ఎంకరేజ్ చేస్తూనే వుంటారు. దర్శకుడు ప్రవీణ సత్తారు కొన్నాళ్ల క్రితం గుంటూరు టాకీస్…

సినిమాల్లో అంతే ఓ నటి లేదా నటుడు నచ్చితే డైరక్టర్లు ఇక వదులుకోరు. తమ సినిమాల్లో మాంచి పాత్రలు ఇస్తూ ఎంకరేజ్ చేస్తూనే వుంటారు. దర్శకుడు ప్రవీణ సత్తారు కొన్నాళ్ల క్రితం గుంటూరు టాకీస్ అనే సినిమా తీసారు.

హీరోయిన్ శ్రద్ద దాస్ కు ఆ సినిమాలో కత్తి లాంటి పాత్ర ఇచ్చారు. ఆమె గెటప్, మగాడ్ని మంచానికి కట్టేసి మరీ మీద దూకే క్యారెక్టరైజేషన్, కలిసి ఆ సినిమాలో శ్రద్ధను బాగా ఎలివేట్ చేసాయి.

అందుకే ఇప్పుడు మళ్లీ తన సినిమాలో శ్రద్ధకు మరో మాంచి పాత్ర ఆపర్ చేసాడు ప్రవీణ్ సత్తారు. రాజశేఖర్ హీరోగా నిర్మిస్తున్న గరుడవేగ చిత్రంలో శ్రద్ద జర్నలిస్ట్ గా కనిపించబోతోంది.

రాజశేఖర్ హీరోగా, కిషోర్ విలన్ గా, పూజా కుమార్ ఓ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఎప్పటికైనా టాప్ జర్నలిస్ట్ కావాలనుకునే పాత్రలో శ్రద్ధ నటిస్తోంది.
సన్నిలియోన్, అవసరాల శ్రీనివాస్, పృధ్వీ, పోసాని, షియాజీ షిండే లాంటి భారీ ప్యాడింగ్ నే వుంది ఈ గరుడవేగ సినిమాకు.