డీజే ఎఫెక్ట్ : వక్కంతం సినిమాకు రిపేర్లు

మేకర్స్ ఎన్నిసార్లు సమర్థించుకున్నా.. క్రిటిక్స్ పై ఎంత విరుచుకుపడినా దువ్వాడ జగన్నాథమ్ సినిమా మిక్స్ డ్ టాక్ తో నడుస్తోందనేది మాత్రం వాస్తవం. బయటకు ఒప్పుకోకపోయినా ఈ విషయం బన్నీకి కూడా తెలుసు. అందుకే…

మేకర్స్ ఎన్నిసార్లు సమర్థించుకున్నా.. క్రిటిక్స్ పై ఎంత విరుచుకుపడినా దువ్వాడ జగన్నాథమ్ సినిమా మిక్స్ డ్ టాక్ తో నడుస్తోందనేది మాత్రం వాస్తవం. బయటకు ఒప్పుకోకపోయినా ఈ విషయం బన్నీకి కూడా తెలుసు. అందుకే ఇప్పుడీ మూవీ ఎఫెక్ట్ బన్నీ నెక్ట్స్ సినిమాపై పడింది.

త్వరలోనే వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య సినిమా చేయబోతున్నాడు బన్నీ. నా ఇల్లు ఇండియా అనేది ఈ మూవీ క్యాప్షన్. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉంది. సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం. కానీ ఇప్పటికే ఓకే చేసిన స్క్రిప్ట్ లో కూడా మరికొన్ని మార్పులు చెప్పాడట అల్లు అర్జున్.

దువ్వాడ జగన్నాథమ్ సినిమా నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా నా పేరు సూర్య సినిమాలో కొన్ని మార్పుచేర్పులు సూచించాడట. ఈ ఛేంజెస్ చేయడానికి ఇంకాస్త టైం పట్టేట్టుంది. దీనికి తోడు డీజే సినిమా ప్రమోషన్ కోసం త్వరలోనే ఓవర్సీస్ లో పర్యటించడానికి బన్నీ రెడీ అవుతున్నాడు. సో… వచ్చే నెల నుంచి సెట్స్ పైకి రావాల్సిన నా పేరు సూర్య సినిమా కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.