పవన్‌కళ్యాణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో సినిమా ఆశించగలమా.? మామూలుగా అయితే ఛాన్సే లేదు. కానీ, రాజమౌళి ముందుకు ఈ ప్రశ్న రాకుండా వుంటుందా.? తప్పదు, ఏదో ఒక వైపు నుంచి ఈ ప్రశ్న అయితే వస్తుంది కాబట్టి, రాజమౌళి సమాధానం చెప్పాల్సిందే. చెప్పేశాడు కూడా.!
'పవన్‌కళ్యాణ్‌తో ఓ సినిమా చేయాలని వుంది. కానీ, ఆయనిప్పుడు రాజకీయాల వైపు మళ్ళారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు పూర్తయి, ఎన్నికలు వంటి వ్యవహారాల తర్వాత, ఏమో.. అప్పుడు పరిస్థితులెలా వుంటాయో చెప్పలేం..' అంటూ రాజమౌళి తాజాగా సెలవిచ్చాడు. అదీ, రానా నిర్వహిస్తోన్న 'నెంబర్ వన్ యారీ' షోలో.
ప్రశ్న వచ్చింది కాబట్టి, రాజమౌళి ఏదో సమాధానం చెప్పాలి కాబట్టి చెప్పాడంతే. అంతకు మించి, పవన్‌కళ్యాణ్‌తో సినిమా సాధ్యమవుతుందని రాజమౌళి కూడా అనుకోవడంలేదు.
రాజమౌళి మాత్రమే కాదు, ఈ కాంబినేషన్ పట్టాలెక్కుతుందని ఎవరు మాత్రం అంచనా వేయగలరు.? ఓ సందర్భంలో, పవన్‌కళ్యాణ్‌తో సినిమా ఎప్పుడు.? అని ఓ వేదికపైనే పవన్‌కళ్యాణ్ సమక్షంలో రాజమౌళికి ప్రశ్న ఎదురయ్యింది.
ఆ సమయంలో, రాజమౌళి చాలా డిప్లమాటిక్‌గా సమాధానమిచ్చాడు. చేయాలనుంది, కుదరాలి కదా.! అనేశాడాయన. అదే వేదికపై పవన్‌కళ్యాణ్, 'ఏ సినిమా కూడా అనుకుని చేసిందిలేదు..' అని ముక్త సరిగ్గా సమాధానమిచ్చాడు.. పరోక్షంగా రాజమౌళితో సినిమా గురించి స్పందిస్తూ. చాలాకాలం క్రిందటి విషయమిది.
నిజానికి, రాజమౌళి – ఎన్టీఆర్‌తో ఓ సినిమా చెయ్యాలి. మహేష్బాబుతోనూ సినిమా చేస్తానని చాలా సందర్భాల్లో రాజమౌళి చెబుతున్న విషయం విదితమే. ప్రభాస్‌తో మరో సినిమా కూడా రాజమౌళి ప్లానింగ్‌లో వుంది.
ఇవన్నీ ఎప్పటికి పూర్తవ్వాలి.? పవన్‌కళ్యాణ్‌తో ఒకవేళ రాజమౌళి సినిమా చేయాలని గట్టిగా అనుకున్నా.. పవన్ ఓకే చెప్పడం, ఈ కాంబినేషన్ పట్టాలెక్కడం.. సాధ్యమయ్యే పనే కాదు.