జై లవకుశ రిలీజ్ డేట్ ప్రకటించేసారు. బాగానే వుంది. కానీ సినిమా మేకింగ్ విషయం చూస్తే ఇంకా చాలా వుంది. జూలై 25 వరకు ఇంకా టాకీ షూట్ వుంది. ఆ పైన ఇంకా చిన్నాచితకా పనులు వుంటాయి.
ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వుండనే వుంటుంది. ఎంత సమాంతరంగా చేసినా, ఆ లెవెల్ పెద్ద సినిమాకు ఓ నెల అన్నా కావాలి. కానీ ఇరవై రోజులే టైమ్ మిగిలేలా వుంది.
ఇదిలా వుంటే ఎన్టీఆర్ మూడు క్యారెక్టర్లు చేయడం వల్ల సినిమాకు విఎఫ్ఎక్స్ పని కాస్త ఎక్కువే వుంది. అప్పటికీ ఆ షాట్స్ అన్నీ కాస్త ముందుగా పిక్చరైజ్ చేసి పంపేసారు. కానీ ఇప్పటికి ఇంకా పని పెండింగ్ లో వుందని తెలుస్తోంది.
ఇలా వర్క్ అంతా వుండడం వల్లనే ఆగస్టు లాస్ట్ వీక్, లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అనుకున్న జై లవకుశకు దసరా డేట్ ప్రకటించారు.
కానీ ఇలా చేయడం వల్ల, ఇప్పుడు ఆ సినిమా టీమ్ పరుగులు పెట్టాల్సి వుంటుందని వినికిడి. దానివల్ల చివర్లో చేసే క్వాలిటీ దెబ్బతింటే ప్రమాదమే.