పవన్ కు అజిత్ కు అదే తేడా

పవన్..అజిత్ ఇద్దరూ హీరోలే. అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వున్నవారే. కానీ మెంటాలిటీలో చాలా తేడా కనిపిస్తోంది. నిర్మాత ఎఎమ్ రత్నం ఒకప్పుడు టాప్ ప్రొడ్యూసర్. అలాంటి వ్యక్తి కష్టాల్లో వుంటే, మూడు సినిమాలు ఇచ్చిన…

పవన్..అజిత్ ఇద్దరూ హీరోలే. అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వున్నవారే. కానీ మెంటాలిటీలో చాలా తేడా కనిపిస్తోంది. నిర్మాత ఎఎమ్ రత్నం ఒకప్పుడు టాప్ ప్రొడ్యూసర్. అలాంటి వ్యక్తి కష్టాల్లో వుంటే, మూడు సినిమాలు ఇచ్చిన హీరో అజిత్.

సినిమాల్లో టాప్ పొజిషన్ లో వున్న హీరో ఇలా తనకు పార్టనర్ షిప్ కానీ, బందుత్వం కానీ లేని నిర్మాతకు ఇలా మూడు సినిమాలు ఇవ్వడం అన్నది చాలా అరుదు. 

మన టాలీవుడ్ లో మాత్రం ఇలా వుండదు వ్యవహారం. పడిపోయిన నిర్మాత పడిపోవడే. తనతో సినిమా నిర్మించి, మటాష్ అయిపోయినా, హీరోలు పట్టించుకున్న దాఖలాలు చాలా అంటే చాలా తక్కువ. అందుకే పాపం, ఎఎమ్ రత్నం తెలుగులో మళ్లీ ఓ మాంచి హిట్ కొట్టాలని చేస్తున్న ప్రయత్నం అలా నీరుకారుతోంది.

ఎఎమ్ రత్నం తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి పవన్ ఓకె అన్నారు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. కానీ ఇప్పుడు ఆ సినిమా లేదనే టాక్ వినిపిస్తోంది.

దాని బదులు పాత అడ్వాన్స్ కు అనుగుణంగా మైత్రీ మూవీస్ తో సినిమా చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. రభస, హైపర్ లాంటి సినిమాలు అందించిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దీని దర్శకుడు.

మైత్రీ మూవీస్ బలమైన సంస్థ. నిర్మాణంలో భారీ సినిమా వున్న సంస్థ. అలాంటి సంస్థకు అర్జెన్సీ లేదు. ఎఎమ్ రత్నం లాంటి వారికే అర్జెన్సీ. మరి పవన్ ఇలా ఎందుకు చేసినట్లో?