బుల్లితెర బ్యూటీకి ‘పెద్ద’ కష్టమే వచ్చింది

తన హస్కీ వాయిస్‌తో, సెక్సీ ఫిజిక్‌తో బుల్లితెర వీక్షకుల్ని అలరిస్తోన్న ఆ బ్యూటీ, వెండితెరపైనా అవకాశాలు దక్కించుకుంటోంది. అయితే, ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ అనూహ్యంగా వెయిట్‌ పెరిగింది. Advertisement బుల్లితెరపై స్టార్‌డమ్‌ తెచ్చుకున్న…

తన హస్కీ వాయిస్‌తో, సెక్సీ ఫిజిక్‌తో బుల్లితెర వీక్షకుల్ని అలరిస్తోన్న ఆ బ్యూటీ, వెండితెరపైనా అవకాశాలు దక్కించుకుంటోంది. అయితే, ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ అనూహ్యంగా వెయిట్‌ పెరిగింది.

బుల్లితెరపై స్టార్‌డమ్‌ తెచ్చుకున్న ఆ బ్యూటీకి వెండితెర అవకాశాలు బాగా పెరిగాయి. అయితే, ఇక్కడే ఆమెకు 'పెద్ద' కష్టం వచ్చింది. అదే బరువు సమస్య. బరువుతోపాటుగా ఫిజిక్‌లో వచ్చిన ఛేంజెస్‌ కారణంగా అవకాశాలు సన్నగిల్లే ప్రమాదముందని ఆమె గ్రహించింది.

ఈ క్రమంలోనే వెయిట్‌ తగ్గడం కోసం కసరత్తులు గట్టిగానే చేస్తున్నా, శరీరంలోని కొన్ని పార్ట్స్‌ ఆమె కోరుకున్న విధంగా షేపప్‌ కాలేకపోతున్నాయట. దాంతో, సర్జరీ ఒక్కటే తన సమస్యకి పరిష్కారం అని ఆ బ్యూటీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం 30లలో వున్న ఆ బ్యూటీ ఫిజిక్‌ బుల్లితెరకు సూటయిపోతున్నా, వెండితెరపైకొచ్చేసరికి తేడా కొట్టేస్తుండడంతోనే ఆమె వీలైనంత త్వరగా తన ఫిజిక్‌ని షేపప్‌ చేసుకోవాలనే స్ట్రిక్ట్‌ డెసిషన్‌ తీసేసుకుంది.

అతి త్వరలోనే ఈ బ్యూటీ సర్జరీ చేయించుకుని, సన్నగా, నాజూగ్గా, మెరుపు తీగలా కన్పించగలననే ధీమా వ్యక్తం చేస్తోంది.

సన్నిహితులు, ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌ ఇచ్చిన సలహా నేపథ్యంలో సర్జరీకి రెడీ అవుతున్న ఆ బ్యూటీ, అనుకున్నట్లుగానే మెరుపు తీగలా త్వరలో కన్పించబోతుందా.? ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు.? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.