సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం!

ఎలాగైనా మూడోసారి అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ దిశ మ‌రో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా.. టీఎస్ ఆర్టీసీని కూడా తెలంగాణ‌ ప్ర‌భుత్వంలో విలీనం…

ఎలాగైనా మూడోసారి అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ దిశ మ‌రో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా.. టీఎస్ ఆర్టీసీని కూడా తెలంగాణ‌ ప్ర‌భుత్వంలో విలీనం చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో 43,373 వేల టీఎస్ ఆర్టీసీ సిబ్బంది అంతా ప్రభుత్వ ఉద్యోగులు కానున్నారు. 

దీనికి సంబంధించిన బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. విలీనం, విధివిధానాలు నిర్ణయించేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా గ‌తంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయ‌ల‌ని పెద్ద ఎత్తున్న ఆర్టీసీ ఉద్యోగులు ధ‌ర్నాలు చేసి.. ప్రాణాలు కోల్పోయిన విలీనంపై మాట ఇవ్వ‌ని ప్ర‌భుత్వం ఉన్న‌ట్లుండి ఇవాళ ఆర్టీసీ విలీనంపై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

కాగా మరో అయిదు నెలల్లో ఎన్నికల రాబోతున్న దృష్ట్యా ఆర్టీసీ విలీనం ఎలా జరుపుతారో తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన‌ విషయం తెలిసిందే.