డిజె నిడివి ఎంత?

దువ్వాడ జగన్నాధమ్ సినిమా సెన్సారు పూర్తయిపోయింది. సెన్సారు టాక్ అంటూ రకరకాల సంగతులు చక్కర్లు కొడుతున్నాయి. అదంతా వేరే సంగతి. అయితే సినిమా నిడివి ఎంత అన్నది అసలు క్వశ్చను. Advertisement ఎందుకంటే ఈ…

దువ్వాడ జగన్నాధమ్ సినిమా సెన్సారు పూర్తయిపోయింది. సెన్సారు టాక్ అంటూ రకరకాల సంగతులు చక్కర్లు కొడుతున్నాయి. అదంతా వేరే సంగతి. అయితే సినిమా నిడివి ఎంత అన్నది అసలు క్వశ్చను.

ఎందుకంటే ఈ రోజుల్లో ప్రేక్షకులు మరీ ఎక్కువ నిడివి వుంటే కుర్చీల్లో కాస్త ఇబ్బందిగా కదులుతున్నారు. వాట్సప్ లు, ఫేస్ బుక్ లు ఓపెన్ చేస్తున్నారు. అయితే నిడివి ఎక్కువైనా హిట్ అయిన సినిమాలు ఈ మధ్య చాలానే వున్నాయి.

అయితే నిడివి ఎక్కువ వున్నా, విషయం వుండాలి. అది కీలకం.. ఇంతకీ డిజె నిడివి ఎంత? అన్నది పాయింట్. డిజె నిడివి రెండు భాగాలు కలిపి రెండు గంటల నలభై నిమషాలు అని ఓ టాక్ వినిపిస్తోంది.

తొలి సగం ఒక గంటా 23 నిమషాలు అని తెలుస్తోంది. అలాగే మలి భాగం ఒక గంటా 12 నిమషాలు వుంటుందని అంటున్నారు. అంటే అన్నీ కలిపి రెండు నలభై నిమషాలు వుంటుందంటున్నారు.

సినిమాలో ఓ పాటకు అభిమానులు లేచి మరీ చిందులేస్తారని తెలుస్తోంది. ఆ పాటలో గ్రాఫిక్స్ వగైరా బాగున్నాయట. ఏది నిజమో మరింత క్లారిటీ రావాల్సి వుంది.