చిరు లీక్స్.. నిజంగానే తెలియదంటున్న యూనిట్

ఆచార్య సినిమా నుంచి 'చిరు లీక్స్' ఫేమస్ అయ్యాయి. స్టేజ్ పై సినిమా టైటిల్ ను అనుకోకుండా ఎనౌన్స్ చేశారు చిరు. అప్పట్నుంచి ఆ ట్రెండ్ అలా నడుస్తూనే ఉంది. తాజాగా భోళాశంకర్ సినిమాకు…

ఆచార్య సినిమా నుంచి 'చిరు లీక్స్' ఫేమస్ అయ్యాయి. స్టేజ్ పై సినిమా టైటిల్ ను అనుకోకుండా ఎనౌన్స్ చేశారు చిరు. అప్పట్నుంచి ఆ ట్రెండ్ అలా నడుస్తూనే ఉంది. తాజాగా భోళాశంకర్ సినిమాకు కూడా 'చిరు లీక్స్' తతంగం నడుస్తోంది.

అయితే 'భోళా'కు సంబంధించి ఇదంతా స్క్రిప్టెడ్ అని అంతా అనుకుంటున్నారు. యూనిట్ మాత్రం ఆ విషయాన్ని ఖండిస్తోంది. చిరంజీవి లీక్ చేసే కంటెంట్ గురించి నిజంగానే తమకు తెలియదని అంటున్నారు యూనిట్ సభ్యులు.

“పవన్ కల్యాణ్ ను ఇమిటేట్ చేసే సన్నివేశాన్ని చిరంజీవి గారు కావాలనే లీక్ చేశారు. ఆ విషయం మాకెవ్వరికీ తెలియదు. అందరితో పాటు నాక్కూడా నోటిఫికేషన్ వస్తే చూసుకున్నాను. ఎడిటర్ కు చెప్పి దగ్గరుండి చేయించుకున్నారు. నాకు తెలిస్తే గొడవ అవుతుందేమో అని అంటూనే, ఏం పర్వాలేదులే లీక్ చేసెయ్ అని వదిలేశారు.”

దర్శకుడు మెహర్ రమేష్ రియాక్షన్ ఇది. లీక్స్ విషయంలో చిరంజీవి, ఆయన అనుకున్నది చేశారని, యూనిట్ లో ఎవ్వరికీ ఆయన సమాచారం ఇవ్వలేదని అంటున్నాడు. అటు తమన్న, సుశాంత్ కూడా ఇదే విషయం చెబుతున్నారు.

విదేశాల్లో ఆన్ లొకేషన్ విజువల్స్ తనకు తెలియకుండా షూట్ చేయించి లీక్ చేశారని తమన్న చెప్పింది. ఇక “జాం జాం జజ్జనక” సాంగ్ కు సంబంధించి సెట్ బాగుందని సుశాంత్ కొన్ని ఫొటోలు తీసుకుంటే చిరంజీవి వారించారట. అవి చాలా కీలకమని ఫొటోలు బయటపెట్టొద్దని అన్నారట. కట్ చేస్తే ఆ తర్వాత కొన్ని రోజులకు చిరంజీవి ఏకంగా వీడియో లీక్ చేశారని చెప్పుకొచ్చాడు సుశాంత్.