నరకం చూపిస్తున్న దర్శకుడు

అతగాడో కొత్త దర్శకుడు. కథ బాగుందని పాపులర్ యంగ్ హీరో దగ్గరకు తీసాడు. నిర్మాత రెడీ అన్నాడు. సినిమా మొదలైంది. అక్కడి నుంచి నరకం కనిపిస్తోంది.  Advertisement దర్శకుడికి విపరీతమైన కోపమో, మరోటో.. మరోటో..…

అతగాడో కొత్త దర్శకుడు. కథ బాగుందని పాపులర్ యంగ్ హీరో దగ్గరకు తీసాడు. నిర్మాత రెడీ అన్నాడు. సినిమా మొదలైంది. అక్కడి నుంచి నరకం కనిపిస్తోంది. 

దర్శకుడికి విపరీతమైన కోపమో, మరోటో.. మరోటో.. మొత్తానికి అందరితో గొడవలే. హీరో.. నిర్మాత తప్ప చాలా అంటే చాలా మంది మారిపోయారు. నిర్మాణ వ్యయం పెరుగుతోంది. దానికి తగినట్లు రేట్లు చెపుతుంటే నాన్ థియేటర్ అమ్మకాలు ముందుకు సాగడం లేదు.

హీరోకి విన్నవించుకున్నా లాభం లేకపోతోంది. హీరో ఆ కథ కోసం.. ఆ సినిమా కోసం దర్శకుడినే వెనకేసుకువస్తున్నాడని తెలుస్తోంది. దాంతో నిర్మాత పళ్ల బిగువన అన్నీ సహించి సినిమా చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. 

ఈ హీరోతో సమస్య ఏమిటంటే కథ నచ్చితే దర్శకుడి గ్రిప్ లోకి వెళ్లిపోతాడు. దర్శకుడు ఏది అంటే అదే. గతంలో చేసిన ఓ సినిమాకు కూడా ఇలాగే జరిగింది. కొత్త దర్శకుడు తన చిత్తానికి ఖర్చు చేయించేసారు. నిర్మాతను హీరో మాట్లాడనివ్వలేదు. అయితే అక్కడ క్వాలిటీ వర్కవుట్ అయింది

కానీ ఇక్కడ అలా కాదు, ఖర్చుతో పాటు టెక్నీషియన్లను కూడా మార్చేస్తున్నారు. రైటర్లు మారిపోతున్నారు. మొత్తం మీద సినిమా ఎలా వస్తుందో అన్న భయం నిర్మాతను వెంటాడుతోంది. కానీ హీరో మాత్రం ఇంకా డైరక్టర్ కే మద్దతు పలుకుతున్నాడు. దాంతో ఏమీ చేయలేని పరిస్థితి.