సమంతతో మరో సినిమా.. కాకపోతే..?

లెక్కప్రకారం ఈ పాటికి కోలీవుడ్ ఎంట్రీ జరిగిపోవాలి. కానీ నాగచైతన్య మాత్రం ఈ ఇయర్ ఆ ప్లాన్స్ నుంచి తప్పుకున్నాడు. తెలుగులో ఇప్పుడిప్పుడే తన మార్కెట్ పెంచుకుంటున్న ఈ హీరో, తమిళనాట కూడా కాలు…

లెక్కప్రకారం ఈ పాటికి కోలీవుడ్ ఎంట్రీ జరిగిపోవాలి. కానీ నాగచైతన్య మాత్రం ఈ ఇయర్ ఆ ప్లాన్స్ నుంచి తప్పుకున్నాడు. తెలుగులో ఇప్పుడిప్పుడే తన మార్కెట్ పెంచుకుంటున్న ఈ హీరో, తమిళనాట కూడా కాలు పెట్టి రెండు పడవల ప్రయాణం చేయడంపై ఇంట్రెస్ట్ చూపించ లేదు. అయితే నాగచైతన్య మైండ్ లో కోలీవుడ్ ప్లాన్స్ మాత్రం అలానే ఉన్నాయి.

కుదిరితే వచ్చే ఏడాది కచ్చితంగా ఓ తమిళ సినిమా చేస్తానంటున్నాడు నాగచైతన్య. దీనికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ కూడా బయటపెట్టాడు. ఒకవేళ తను తమిళ సినిమా చేస్తే అందులో సమంతానే హీరోయిన్ గా ఉంటుందని కూడా చెప్పేశాడు.

తెలుగులోనే కాదు, కోలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది సమంతకు. సూర్య, విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఆమెను హీరోయిన్ గా పెట్టుకుంటే తన తొలి తమిళ సినిమాకు మంచి మైలేజీ వస్తుందని నాగచైతన్య అభిప్రాయం.

అక్టోబర్ 6న నాగచైతన్య-సమంత పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని, ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల్ని కంప్లీట్ చేయనుంది సమంత. ఆ కమిట్ మెంట్స్ పూర్తయిన తర్వాత నాగచైతన్య-సమంత కాంబోలో తమిళ సినిమా ఉండే అవకాశముంది.