హఠాత్ గా పెళ్లి చేసేసుకుని అంతే వేగంగా విడాకులు తీసేసుకుని ఒంటరయ్యింది అమలపాల్. హీరోయిన్ గా అవకాశాలున్న దశలోనే పెళ్లి చేసుకున్న అమల.. మెట్టినింటి వారితో వివాదంతో విడాకులు తీసుకుంది. ఆ వివాదానికి కారణం ఏమిటనే అంశంపై క్లారిటీ లేదు.
పెళ్లి తర్వాత ఆమె సినిమాల్లో నటించడం మెట్టినింటి వారికి ఇష్టం లేదని.. దీంతో పుట్టిన విబేధాలతో అమల విడాకులు తీసుకున్నట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.
అలాగే అమల, ఆమె భర్త విడాకులకు కారణం ఒక తమిళ హీరో అనేమాటా వినిపించింది. ఓవరాల్గా అదో మిస్టరీగానే మిగిలింది. ఆ తర్వాత పలు దఫాల్లో అమల స్పందిస్తూ.. పెళ్లి, విడాకులు.. రెండూ తొందరపాటే అని చెప్పింది.
మరి గత కొన్నాళ్లుగా సినిమాలతోనే బిజీగానే ఉన్న అమల ఇప్పుడు తన హాట్ కామెంట్స్ తో వార్తల్లోకి వస్తోంది. సుచీలీక్స్ పై స్పందించి గత వారంలో వార్తల్లోకి వచ్చింది. తనను తాను సూచీ లీక్స్ లో చూసుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేసింది అమల. ఆ విధంగా వ్యంగ్యంగా స్పందించిన అమల.. ఇప్పుడు పెళ్లి విషయంలో కూడా ఆసక్తికరమైన కామెంట్ చేసింది.
తనకు మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందని అమల స్పష్టం చేసింది. నేనేం సన్యాసం తీసుకుని హిమాలయాలకు వెళ్తానని అనుకున్నారా? అని ప్రశ్నించిన అమల, తను మళ్లీ పెళ్లి చేసుకుంటాను అని ,అది కూడా ప్రేమించే పెళ్లి చేసుకుంటాను.. అని స్పష్టం చేసింది.
ప్రేమించడానికి తగిన మగడి కోసం ఎదురుచూస్తున్నట్టుగా చెప్పింది. మరి తొలి వివాహం చేదు అనుభవాన్నే మిగిల్చినా.. అమల మళ్లీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే ఆశతో ఉంది. ఈ సారైనా ఆమెకు తగిన భర్త అయ్యే ప్రియుడు దక్కుతాడని ఆశిద్దాం.