తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. ఆ మాటకు వస్తే, పేకాటేమిటి? సినిమాలేమిటి? ఎక్కడయినా అంతే. ఈ ఉద్దేశంతోనే రామ్ చరణ్, ఆయన యూనిట్ త్వరపడి సంక్రాంతి విడుదల అంటూ ముందే ప్రకటించారట.
ఇప్పుడు ఈ విషయమై ఇండస్ట్రీ గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. సుకుమార్-రామ్ చరణ్ సినిమా కథ అన్ని సుకుమార్ సినిమాల మాదిరిగానే వుంది. అంటే, నిర్మాణం స్లో పేస్ లో నడవడం అన్నమాట. దసరాకు వస్తుందనుకున్న సినిమా అలా నత్త నడక నడుస్తోంది.
ఇలాంటి టైమ్ లో త్రివిక్రమ్-పవన్ సినిమా సంక్రాంతికి అన్న టాక్ వినిపించడం ప్రారంభమైంది. ఇలాంటి టైమ్ లో తొందర పడకపోతే, ఉగాదికి వెళ్లిపోవాలి అన్నడవుట్ పుట్టినట్లుంది.
అందుకే అర్జెంట్ గా ఫస్ట్ లుక్ వదులుతూనే, సంక్రాంతి విడుదల అని ప్రకటించేసారని తెలుస్తోంది. ఇలా ప్రకటించడం ద్వారా సంక్రాంతి కి తామే ముందు డేట్ చెప్పేసిన క్రేడిట్ కొట్టేసారు.
అయితే తమ సినిమా సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిసీ, అబ్బాయ్ రామ్ చరణ్ ఇలా ఆదరా బాదారాగా ప్రకటించేయడం పట్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫీలయినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది, ప్రకటించేముందు కనీసం ఓసారి సంప్రదించి వుంటే బాగుండునని పవన్ పీలవుతున్నట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
అల్లప్పుడెప్పుడో, అబ్బాయ్ చరణ్ తో సినిమా చేస్తా అని బాబాయ్ పవన్ చెప్పాడు. కానీ అది మాత్రం కనిపించడం లేదు. ఇలాంటి గ్యాప్ లు ఆ సినిమాను మరింత దూరం నెడతాయేమో?