హమ్మయ్య.. భాగమతి పూర్తయ్యింది

అనుష్క హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో నటిస్తున్న సినిమా భాగమతి. యువి క్రియేషన్స్ సంస్థ భారీ నిర్మాణ వ్యయంతో నిర్మించిన సినిమా ఇది. దీనికోసం అన్నపూర్ణలో, అల్యూమినియం ఫ్యాక్టరీలో అద్భుతమైన భారీ సెట్ లు కూడా…

అనుష్క హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో నటిస్తున్న సినిమా భాగమతి. యువి క్రియేషన్స్ సంస్థ భారీ నిర్మాణ వ్యయంతో నిర్మించిన సినిమా ఇది. దీనికోసం అన్నపూర్ణలో, అల్యూమినియం ఫ్యాక్టరీలో అద్భుతమైన భారీ సెట్ లు కూడా వేసారు.

సిజి వర్క్స్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. దాంతో ఈ సినిమా ఇదిగో, అదిగో అంటూ ఎప్పటి నుంచో వార్తల్లో వినిపిస్తోంది తప్ప, పూర్తవుతున్న వార్తలు వినిపించలేదు.

లేటెస్ట్ సంగతి ఏమిటంటే? ఈ సినిమా వర్క్ మొత్తం పూర్తయిందట. ఇక ఫస్ట్ లుక్ లు, టీజర్లు, అంటూ హడావుడి స్టార్ట్ చేస్తారట. అనుకున్నవి అన్నీఅనుకున్నట్లు అయితే దీపావళికి తెలుగు, తమిళ వెర్షన్లు ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

బాహుబలి 2 క్రేజ్ అలా వుండగానే అనుష్క పేరును మార్కెట్ చేసుకోవానికి వీలవుతుందని భావిస్తున్నారు.

పిల్ల జమీందార్, సుకుమారుడు, చిత్రాంగద సినిమాలు అందించిన అశోక్ ఈ సినిమాకు దర్శకుడు. వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు.