లై… నితిన్-హను రాఘవపూడి కాంబినేషన్ లో ముస్తాబవుతున్న లేటెస్ట్ సినిమా. ఈ సినిమా ఏకంగా 70 రోజులకు పైగా విదేశంలో షెడ్యూలు జరుపుకుంది. ఈ సినిమా కు నలభై కోట్లకు పైగా బడ్టెట్ పెడుతున్నారని, ఇది నితన్ కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ అని వార్తలు వినవచ్చాయి.
అదే సమయంలో త్రివిక్రమ్ తోడు వుంటేనే, 40 కొట్ల మేరకు కలెక్షన్లు రావడం కష్టం అయిదని, అలాంటిది, హను రాఘవపూడి సినిమాకు నలభై కోట్లకు పైగా ఖర్చు చేయడం ఏమిటి? అని కామెంట్లు వినిపించాయి.
అయితే లేటెస్ట్ గా తెలుస్తున్న సంగతి ఏమిటంటే, ఈ సినిమా అసలు సిసలు బడ్జెట్ ముఫై కోట్లకు కాస్త అటుగా మాత్రమే అని. సినిమాకు బజ్ కోసం అలా చెబుతున్నరని, వాస్తవంగా అవుతున్న ఖర్చు అయితే ముఫై కోట్లకు కాస్త అటుగా మాత్రమే అని తెలుస్తోంది.
నిర్మాతలకు, బ్యానర్ కు అమెరికా దాదాపు పుట్టిల్లు లాంటిదే. అక్కడ అంతగా లోకల్ అయిపోయారు వాళ్లు. దాంతో వాళ్ల వాళ్ల పరిచయాలు, స్నేహాలు ఉపయోగించి, వీలయినంత కాస్ట్ కటింగ్ తోనే నిర్మాణం కానిచ్చారని అంటున్నారు.
నలభై కోట్లకు ఫైగా అని చెప్పకపోతే, సినిమాకు మార్కెట్ ఆ రేంజ్ రావడం కష్టం అని, అందుకే అలా చెబతున్నారని ఓ గ్యాసిప్. లేదు, ఇంకా వర్క్ చాలా వుందని, అన్నీ కలుపుకుంటే నలబైకి పైనే అవుతుందని మరో టాక్. మరి ఏది నిజమో? ఏది లై నో?