సాక్షాత్తూ సూపర్ స్టార్ మహేష్ బాబే దసరాకు వస్తున్నాం అని డేట్ ప్రకటించేసారు. స్పైడర్ సినిమా పాటలు మినహా దాదాపు ఫినిష్ అయిపోయినట్లే. పాటలు కూడా పెద్ద సమస్య కాదు. అందువల్ల అనుకున్న ప్రకారం దసరాకు వచ్చేయాలి. కానీ విఎఫ్ఎక్స్ పనుల విషయంలోనే అనుమానం కలుగుతోందట.
సీన్లోకి ముందుగా ఎంటర్ అయితే ఎలా వుండేదో, చివరిలో ఎంటర్ అయింది మకుట సంస్థ. ఇప్పుడు ఈ సంస్థ ఇన్ టైమ్ లో పనులు పినిష్ చేసి ఇవ్వగలిగితే ఓకె. లేదూ అంటే కాస్త వెనక్కు జరగాల్సి వస్తుందేమో అన్న అనుమానాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
అయితే అలాంటి అనుమానాలు అక్కరలేదని, అనుకున్న ప్రకారం దసరాకే స్పైడర్ వస్తుందని యూనిట్ వర్గాలు అయితే అంటున్నాయి. మరోపక్క సంక్రాంతికి రామ్ చరణ్ సినిమా వుండడంతో, స్పైడర్ కనుక కాస్త వెనక్కు వెళ్తే, ఆ స్లాట్ లోకి రావాలని పవన్-త్రివిక్రమ్ సినిమా యూనిట్ ఆలోచిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అందుకే ఎప్పుడు డేట్ దొరకుతుందో తెలియదు కాబట్టి, రెడీగా వుండాలని చకచకా ఆ సినిమాను రెడీ చేస్తున్నారు. కానీ దానికి కూడా విఎఫ్ఎక్స్ వర్క్ వుంది. దాన్ని ముంబాయి టీమ్ టేకప్ చేసింది.
మొత్తం మీద విఎఫెఎక్స్ పనులు పెట్టుకున్న సినిమాల విడుదల ఏదీ హీరోలు-నిర్మాతల చేతుల్లో వుంటున్నట్లు కనిపించడం లేదు.