కొన్నాళ్ల క్రితం అభిషేక్ పిక్చర్స్ బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేయాల్సి వుంది. వున్నట్లుండి ఆ ప్రాజెక్టు మిరియాల రవీందర్ రెడ్డి దగ్గరకు వెళ్లిపోయింది. ఏమిటీ సమస్య అంటే, అభిషేక్ పిక్చర్స్ జనాలు ఒకటే మాట చెప్పేవారు.
హీరో శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ ఇంటర్ ఫియరెన్స్ తట్టుకోలేకపోతున్నాం అని. ఆయన ఫలానా టెక్నీషియన్, ఫలానా నటులు అంటూ, పారితోషికాలు కూడా ఆయన ఫిక్స్ చేసి, తమ మీద రుద్దేస్తున్నారని అందుకే ప్రాజెక్టు వదిలేసుకున్నామని అప్పట్లో అభిషేక్ జనాలు ఆఫ్ ది రికార్డుగా చెప్పేవారు.
కట్ చేస్తే, ఇప్పుడు మళ్లీ బెల్లంకొండ శ్రీనివాస్ ప్రాజెక్ట్ ఒకటి మేఘన ఆర్ట్స్ లో పివి రావు నిర్మాతగా ఇలా ప్రారంభమై, అలా చేతులు మారింది. ఈసారి వేరే వాళ్ల దగ్గర నుంచి అభిషేక్ చేతిలోకి వచ్చింది. మరి ఇప్పుడు బెల్లంకొండ జోక్యం తగ్గిందా? లేక అభిషేక్ జనాలు సర్దుకుంటున్నారా? అన్నది అనుమానం.
బెల్లకొండ శ్రీనివాస్ సినిమాల డీల్ కామన్ గా ఇలా వుంటుందని అంటారు. హీరోకి రెమ్యూనిరేషన్ ఇవ్వక్కరలేదు. కానీ మూడు కోట్లుగా ఫిక్స్ చేసి, సినిమా మార్కెట్ అయిన తరువాత దానికి తగిన ఏరియా ఇస్తే చాలు అని.
పైగా కాస్త సపోర్టు కూడా వుంటుదని. మరి ఇలాంటి ఫీజుబులిటీ వుంటుదని అభిషేక్ మళ్లీ రంగంలోకి దిగింది అనుకోవాలా? లేక గతంలో అభిషేక్ లాంటి అనుభవం ఇప్పుడు ఎదురై మేఘన ఆర్ట్స్ నిర్మాత పివి రావు పక్కకు తప్పుకున్నారు అనుకోవాలా? ఏమో?