ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నట్లు వార్తలు అందుతున్నాయి. హీరోయిన్ గా ఐశ్వర్యరాయ్ అని ఇప్పటికే వార్తలు బోలెడు చక్కర్లు కొట్టేసాయి. ఈ సినిమా కోసం సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ ను తీసుకుంటున్నారని తెలుస్తోంది.
తెలుగులో బన్నీ బద్రీనాధ్, హిందీలో సంజయ్ లీలా భన్సాలీ రామ్ లీలా, తమిళంలో కమల్ దశావతారం సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు ఇతను. రవి వర్మన్ కు మంచి టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ గా పేరుంది. ఉయ్యాలవాడకు కచ్చితంగా అతను మంచి ఛాయిస్ అవుతాడు.
ఇదిలా వుంటే ఉయ్యాలవాడ సినిమాను మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ముహుర్తం చేస్తారని తెలుస్తోంది. ఆగస్ట్ 22న ముహుర్తం చేసి, అక్కడి నుంచి షూట్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఈలోగా చిరంజీవి మళ్లీ కొన్నాళ్ల పాటు యోగా, జిమ్ వంటి వాటిపై కేంద్రీకరించి ఫిట్ నెస్ పై దృష్టి పెడతారని తెలుస్తోంది.