బన్నీ సినిమాకు ఇలాంటి పోటీనా?

చిన్న సినిమాలను జనాల దగ్గరకు తీసుకెళ్లడానికి, లేదా థియేటర్లకు జనాలను రప్పించడానికి రకరకాల చిట్కాలు వాడుతుంటారు. ఫేస్ బుక్ ను, వాట్సప్ లను వాడి ఏదో ఒకటి చేస్తుంటారు. Advertisement కానీ పెద్ద హీరోల…

చిన్న సినిమాలను జనాల దగ్గరకు తీసుకెళ్లడానికి, లేదా థియేటర్లకు జనాలను రప్పించడానికి రకరకాల చిట్కాలు వాడుతుంటారు. ఫేస్ బుక్ ను, వాట్సప్ లను వాడి ఏదో ఒకటి చేస్తుంటారు.

కానీ పెద్ద హీరోల సినిమాలకు ' కనుక్కోండి చూద్దాం '…'సినిమాకు పేరు పెట్టండి'..' ఈ సినిమాలో పాటలు పాడి పంపండి' ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు అవసరం లేదు. పైగా అలాంటివి చేస్తే సినిమా లెవెల్ కిందకు జారే ప్రమాదం వుంది.

డిజె విషయంలో డైరక్టర్ హరీష్ శంకర్ చొరవ తీసుకుని పెట్టిన పోటీ పట్ల ఇండస్ట్రీలో ఇలాంటి కామెంట్ లే వినిపిస్తున్నాయి. డిజె సినిమా ట్రయిలర్ లో నచ్చిన డైలాగ్ తీసుకుని, డబ్ స్మాష్ చేసి ఫేస్ బుక్ పేజీలో పెడితే అయిదుగురిని ఎంపిక చేసి, అల్లు అర్జున్ చేతుల మీదుగా బహుమతి ఇప్పిస్తారు.

పోటీకి మంచి స్పందనే వస్తుంది. అందులో సందేహం లేదు. కానీ బన్నీ సినిమా అంటే విడుదలకు ముందే వీర బజ్ వస్తుంది. ఆ బజ్ కు తగ్గట్లు ఆలోచనలు వుండాలి. కానీ, చిన్న సినిమాలకు చేసినట్లు ఇలా చేయడం ఏమిటో అని ఇండస్ట్రీ సర్కిళ్లలో కామెంట్లు వినిపిస్తున్నాయి.