అప్పుడు గ్యారేజ్ ఇప్పుడు అసెంబ్లీ

జనతాగ్యారేజ్ సినిమాలో గ్యారేజ్ దే కీలకపాత్ర. సినిమా చాలా వరకు ఆ గ్యారేజ్ లో జరుగుతుంది. అందుకే దర్శకుడు కొరటాల శివ ఓ గ్యారేజ్ సెట్ భారీగా వేయించారు. అది సినిమాకు చాలా ప్లస్…

జనతాగ్యారేజ్ సినిమాలో గ్యారేజ్ దే కీలకపాత్ర. సినిమా చాలా వరకు ఆ గ్యారేజ్ లో జరుగుతుంది. అందుకే దర్శకుడు కొరటాల శివ ఓ గ్యారేజ్ సెట్ భారీగా వేయించారు. అది సినిమాకు చాలా ప్లస్ అయింది. ఇప్పుడు మళ్లీ కొరటాల శివకు మాంచి సెట్ అవసరం కలిగిందని తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో భరత్ అనే నేను అంటూ ఢిఫరెంట్ పోలిటికల్ మూవీ చేస్తున్నాడు కొరటాల శివ. ఈ సినిమా కోసం అసెంబ్లీ సెట్ అవసరం పడుతోందని తెలుస్తోంది. మన సినిమాలన్నింటిలో అసెంబ్లీ సీన్లు అవసరం అయినపుడల్లా సెట్ వేయడం అన్నది కామన్. గతంలో లీడర్ సినిమాకు శేఖర్ కమ్ముల కూడా ఇదే చేసాడు. 

అయితే అందరూ ఇన్ సైడ్ సెట్ వేసి వదిలేస్తారు. అయితే ఈసారి కొరటాల శివ మరి కొంచెం ముందుకు వెళ్లి బయట లుక్ ను కూడా సెట్ వేయాలనుకుంటున్నాడని తెలుస్తోంది. అయితే అది హైదరాబాద్ లో వున్న అసెంబ్లీ మాదిరిగా సెట్ వేస్తారా? లేక ఒక కొత్త లుక్ తో అసెంబ్లీ సెట్ వేసి, చంద్రబాబు నాయుడుకు ఓ డిజైన్ ఐడియా అందిస్తారా? చూడాలి మరి.