థమన్ లేరా? లేక ఫీలయ్యారా?

సర్కారు వారి పాట యూనిట్ పార్టీ చేసుకుంది. ఎందుకు చేసుకుంది అన్నది అప్రస్తుతం. సినిమా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి, విడుదల చేయగలిగినందుకు కావచ్చు.  Advertisement ఈ పార్టీకి ఎప్పటి లాగే మైత్రీ…

సర్కారు వారి పాట యూనిట్ పార్టీ చేసుకుంది. ఎందుకు చేసుకుంది అన్నది అప్రస్తుతం. సినిమా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి, విడుదల చేయగలిగినందుకు కావచ్చు. 

ఈ పార్టీకి ఎప్పటి లాగే మైత్రీ మూవీస్ తో అనుబంధం వున్న వారంతా హాజరయ్యారు. అదే విధంగా మళ్లీ మామూలుగానే త్రివిక్రమ్ కు ఆహ్వానం లేదు. మెహర్ రమేష్ ఎలాగూ మహేష్ వైపు నుంచి స్పెషల్ గెస్ట్. 

అంతా బాగానే వుంది. కానీ, కళావతి సాంగ్ తో సినిమాకు ఊపు తెచ్చిన థమన్ మాత్రం కనిపించలేదు. థమన్ ఎక్కువగా హైదరాబాద్ లోనే వుంటారు. శని, ఆదివారాలు తప్ప. మరి శుక్రవారం పార్టీ జరిగితే ఎందుకు  రాలేదు అన్నది డవుట్. బహుశా చెన్నయ్ వెళ్లారేమో అన్నది ఓ సమాధానం.

చెన్నయ్ వెళ్లి వుండి రాకపోతే ఒకె. అలా కాకుండా సినిమాకు సరైన ఆర్ఆర్ ఇవ్వలేదని కొంత కామెంట్ వుంది. ట్రోలింగ్ వుంది. 

అలాగే మ..మ..మహేషా పాట మీద కూడా విమర్శలు వున్నాయి. వాటన్నింటినీ దృష్టి లో వుంచుకుని ఫీలై రాకపోతే మాత్రం….అంత బాగోదు.