మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని పెద్ద బఫూన్ అని నర్శీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ స్ట్రాండ్ డోస్ ఇచ్చేశారు. ఆయన అనుచిత అనవసరమైన మాటలు చూస్తే అదే అనిపిస్తుందని అన్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పెట్ల ఉమాశంకర్ గణేష్ నాతవరం మండలలో పర్యటిస్తూ అయ్యన్నను మాటలతో చెడుగుడు ఆడేశారు.
కోతికి కొబ్బరికాయ దొరికంట్లుగా తనకు ఎమ్మెల్యే పదవి దొరికింది అని అయ్యన్న అంటున్నారని, ఆరు సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న అయ్యన తన కంటే పెద్ద కోతి కాదా అని నిలదీశారు. తాను సీఎం జగన్ కి కలసి నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువస్తూంటే సెల్ఫీల కోసం కలుస్తున్నాను అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
రాజకీయ బిక్ష పెట్టిన జగన్ తో సెల్ఫీ తీసుకోవడంలో తప్పు లేదని, కానీ తనకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను, మంత్రిని చేసి రాజకీయ బిక్షను పెట్టిన ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడిచిన అయ్యన్నకు నైతిక విలువలు ఏవీ లేవని పెట్ల ఫైర్ అయ్యారు.
తన పదవీకాలంలో నర్శీపట్నానికి ఏ ఒక్క ప్రాజెక్టుని తేలేని అయ్యన్న ఇపుడు పెద్ద నోరు చేసుకుంటూ తమ మీద ఆరోపణలు చేస్తున్నారు అన్నారు.
ఏపీలో నాసిరకం బ్రాండ్లను పెట్టిందే చంద్రబాబు అన్న సంగతి అయ్యన్న మరచిపోతే ఎలా అంటూ సెటైర్లు వేశారు. ఇక బూం బూం బీర్ పేరుతో బ్రాండ్ దించింది బాబు కాదా అని పెట్ల నిలదీశారు.
ప్రజాదరణ కోల్పోయిన అయ్యన్నను, చంద్రబాబుని 2019 ఎన్నికలలో బాదుడే బాదుడు అని జనాలు బాదేశారని, 2024లో మరో రౌండ్ రెడీగా ఉందని పెట్ల హాట్ హాట్ కామెంట్స్
చేశారు. మొత్తానికి వారూ వీరూ అని చూడకుండా తెల్లారిలేస్తే అందరి మీద అనుచిత కామెంట్స్ చేస్తున్న అయ్యన్నకు ఎమ్మెల్యే బాగానే గట్టి డోస్ ఇచ్చేశారు అని వైసీపీ నేతలు అంటున్నారు.