డైరక్టర్ విక్రమ్ కుమార్ టచ్ చేసిన జోనర్ ను టచ్ చేయకుండా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. తొలిసారి యాక్షన్ జోనర్ లోకి ఎంటర్ అయ్యాడు ఆయన. 24 సినిమాలో ఒకటి రెండు ఫైట్లు చూసిన తరువాత, విక్రమ్ కుమార్ యాక్షన్ సినిమా ఏ రేంజ్ లో వుంటుందో ఊహించుకోవచ్చు.
అక్కినేని అఖిల్ తో చేస్తున్న సినిమా కోసం ఏకంగా ఫారిన్ ఫైట్ మాస్టర్లను హైదరాబాద్ రప్పించాడట.
ఫస్ట్ షెడ్యూలు మొత్తం కేవలం యాక్షన్ పార్ట్ లు షూట్ చేయడానికే కేటాయించాడట. మొత్తం ఇరవై రోజుల పాటు కేవలం యాక్షన్ సీన్లు మాత్రమే చిత్రీకరించారట. మెట్రో స్టేషన్లు, ఫుడ్ గౌడన్లు, ఇలా కొన్ని కీలకమైన చోట్ల చకచకా యాక్షన్ సీన్లు చేయడం కోసం జస్ట్ 12 కోట్లు ఖర్చు చేసారట.
విక్రమ్-అఖిల్ కాంబినేషన్ లో సినిమా కోసం నాగ్ భారీ బడ్జెట్ నే కేటాయించిన సంగతి తెలిసిందే. మళ్లీ మరో రెండు రోజుల్లో సెకెండ్ షెడ్యూలు ప్రారంభం కానుంది.