నయనతార ఇప్పుడు పూర్తిగా తమిళ సినిమాలకే అంకితమైపోయింది. అడిగినంత ఇచ్చే నిర్మాతలు, తను చేసే పాత్రకు వెయిట్ ఉండేలా సినిమాలు తీసే దర్శకులు కోలీవుడ్ లో ఉండడంతో ఆమెకు అక్కడ కంఫర్ట్ గా ఉంది. అప్పుడప్పుడు తెలుగులో ఆమె సినిమాలు చేస్తున్నప్పటికీ.. ఏదో ఒక వివాదం బయటకు వస్తూనే ఉంది. తాజాగా అలాంటిదే నయన్ పై మరో వార్త గుప్పుమంటోంది.
ఆరడుగుల బుల్లెట్ అనే సినిమాలో గోపీచంద్ సరసన నటించింది నయనతార. ఈ సినిమా ఇప్పటిది కాదు. ఐదేళ్ల కిందట స్టార్ట్ అయిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ నెలలో థియేటర్లలోకి వస్తోంది. కిందామీద పడి ఎట్టకేలకు థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాకు కాస్త హైప్ తీసుకొచ్చేందుకు నయనతారతో ప్రమోషన్ చేయిద్దామనుకున్నారు. అయితే నయనతార మాత్రం 30 లక్షలు డిమాండ్ చేసి నిర్మాతలకు షాక్ ఇచ్చింది.
ఆరడుగుల బుల్లెట్ కు ప్రమోషన్ ఇవ్వాలంటే తనకు 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిందట నయనతార. 2 రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండి ప్రింట్, టీవీ, వెబ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు ఈ మొత్తం అడిగిందట. ఇప్పటికే అప్పు చేసి రిలీజ్ చేస్తున్నారు సినిమాని. ఇలాంటి టైమ్ లో నయనతారకు 30 లక్షలు ఇస్తారా అనేది డౌట్. ప్రస్తుతానికైతే నయనతార లేకుండానే ప్రమోషన్ నడుస్తోంది.