రామ్ చరణ్ షూటింగ్ ఉంటుందా ఉండదా..?

దాసరి మృతితో టాలీవుడ్ లో కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. ఈరోజు సినిమా షూటింగ్స్ అన్నీ రద్దయ్యాయి. పవన్ కల్యాణ్ అయితే ఏకంగా 3 రోజుల పాటు షూటింగ్ రద్దుచేశాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ సినిమా…

దాసరి మృతితో టాలీవుడ్ లో కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. ఈరోజు సినిమా షూటింగ్స్ అన్నీ రద్దయ్యాయి. పవన్ కల్యాణ్ అయితే ఏకంగా 3 రోజుల పాటు షూటింగ్ రద్దుచేశాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ సినిమా షూటింగ్ ఉంటుందా ఉండదా అనేది డౌట్. లెక్కప్రకారమే రేపట్నుంచి రామ్ చరణ్ కొత్త సినిమా షూట్ మొదలుకావాలి.

రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రేపట్నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభమౌతుందని యూనిట్ ఇదివరకే ప్రకటించింది. అక్కడ ఏర్పాటుచేసిన భారీ సెట్ లో రామ్ చరణ్ పై ఇంట్రడక్షన్ సాంగ్ పిక్చరైజ్ చేస్తామని కూడా తెలిపింది. మరి దాసరి అకాల మరణంతో ఆ షెడ్యూల్ ఉంటుందా ఉండగా అనేది అనుమానం.

రామ్ చరణ్ సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ లేట్ అవుతూ వస్తోంది. ఫస్ట్ షెడ్యూల్ ను రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిపారు. సమంతకు వడదెబ్బ తగలడంతో ఆ షెడ్యూల్ ను 3 రోజుల ముందే ముగించారు. నెక్ట్స్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్రారంభించినప్పటికీ ఎండలు బాగా ముదిరిపోవడంతో 4 రోజులకే ముగించారు. అలా లేట్ అవుతూ వస్తున్న సినిమా రేపట్నుంచి మళ్లీ రీ-స్టార్ట్ అవుతుందా అవ్వదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.