స్వామిరారా సినిమాతో టాలీవుడ్ లోకి డైరక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ వర్మ తన మూడో సినిమా కేశవతో ఓ చమక్కు చేసాడు. జస్ట్ ఆరున్నర కోట్ల ప్యాకేజ్ తో ఆ సినిమాను ఫినిష్ చేసాడు. ఆ ఆరున్నర కోట్లలోనే హీరో, హీరోయిన్, డైరక్టర్ తో సహా ప్రతి ఒక్కరి రెమ్యూనిరేషన్ లు వున్నాయి. పోనీ అలాఅని సినిమా రిచ్ నెస్ ఏమన్నా తక్కువ వుందా అంటే అదీకాదు. డ్రోన్ లు వంటి లేటెస్ట్ టెక్నాలజీ వాడి, ఏరియల్ వ్యూలు తెగ చూపించి సినిమాకు కొత్త లుక్ తెచ్చాడు. సంగీతం కోసం ఇద్దర్ని వాడాడు. సన్నీని పాటలకు, ప్రశాంత్ ను బ్యాక్ గ్రవుండ్ కు.
ఇన్నీ కూడా ఆరున్నర కోట్లలోనే. సుధీర్ చేసిన చమక్కు ఏమిటంటే, స్టార్ కాస్ట్ కోసం అస్సలు ఖర్చు పెట్టకుండా, టెక్నికల్ వర్క్ కు, ఖర్చు చేయడం. సెట్ ల జోలికి పోకుండా నేచురల్ లోకేషన్లకు వెళ్లడం. అజయ్, రావు రమేష్, బ్రహ్మాజీ లాంటి వాళ్లు వున్నా, ఒకటి రెండు రోజుల కాల్ షీట్లతో పని కానిచ్చేసారు. మిగిలిన నటులంతా అయితే చిన్న చిన్న వాళ్లు, మిగిలిన వాళ్లంతా లోకల్ కొత్త ఫేస్ లు. నిఖిల్, ఇద్దరు హీరోయిన్లు, వెన్నెల కిషోర్, మరొక ఒకరిద్దరు మాత్రమే ఎక్కువ కనిపిస్తారు.
సో, దానివల్ల కేవలం ఆరున్నర కోట్లలో ఈ రేంజ్ అవుట్ పుట్ ఇవ్వగలిగాడు. దర్శకులు ఈ టైపులో కాస్త ఆలోచిస్తే, నిర్మాతలకు కాస్త బాగానే వుంటుంది. ఒక్క ఆంధ్రలోనే నాలుగున్నర కోట్లకు విక్రయించారంటే అర్థం అవుతుంది దర్శకుడు సుధీర్ వల్ల నిర్మాతకు ఏమాత్రం లాభం వచ్చిందో?