ఒక్కో సినిమా నిర్మిస్తుంటే, భలే హుషారుగా వుంటుంది. ఒక్కో సినిమా స్టార్ట్ చేస్తే, ఎందుకు స్టార్ట్ చేసామా అన్నట్లు వుంటుంది. నిర్మాత దిల్ రాజుకు ఈ రెండూ ఫుల్ గా అనుభవం లోకి వచ్చేసాయి ఒకేసారి. బన్నీతో డిజె సినిమా చేస్తున్నారు. చిన్న చిన్న సెట్ బ్యాక్ ల సంగతి పక్కన పెడితే, ఆల్ మోస్ట్ ఓ కొలిక్కి వచ్చేసింది. అందువల్ల హ్యాపీ.
కానీ వరుణ్ తేజతో చేస్తున్న ఫిదా సినిమాతోనే వస్తోంది అసలు సిసలు తకరారు. ఇప్పటికే మీడియం సినిమా షూటింగ్ డేస్ ను దాటిపోయింది. ఈ సినిమాను శేఖర్ కమ్ముల చెక్కుతున్నారు. దీంతో వంద వర్కింగ్ డేస్ దాటిపోతుందని అంచనా వేస్తున్నారట. దీంతో దిల్ రాజు చాలా అసహనంగా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది.
వరుణ్ తేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. ఇలా అలా అని ఆఖరికి దసరా సీజన్ దాటిపోయేలా వుందని వినికిడి. పైగా సినిమా షూట్ అంతా ఒక్క దగ్గర కాదు. చాలా లోకేషన్లు వున్నాయి. వాటిల్లో ఫారిన్ లోకేషన్లు కూడా వున్నాయి. అదీ సమస్య. సినిమా చకచకా సాగక దిల్ రాజు చాలా అసహనంగా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది.