డాక్ట‌ర్ సుధాక‌ర్‌ను మ‌రిపించిన‌ లోకేశ్!

డాక్ట‌ర్ సుధాక‌ర్ గుర్తున్నారా? గ‌త ఏడాది నిత్యం వార్త‌ల్లో క‌నిపించారాయ‌న‌. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో ఎనస్థీషియన్‌గా పని చేస్తున్న డాక్టర్ సుధాకర్ వైద్యులకు ఎన్‌-95 మాస్కులు తగినన్ని సరఫరా చేయడం లేదని…

డాక్ట‌ర్ సుధాక‌ర్ గుర్తున్నారా? గ‌త ఏడాది నిత్యం వార్త‌ల్లో క‌నిపించారాయ‌న‌. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో ఎనస్థీషియన్‌గా పని చేస్తున్న డాక్టర్ సుధాకర్ వైద్యులకు ఎన్‌-95 మాస్కులు తగినన్ని సరఫరా చేయడం లేదని ప్ర‌భుత్వంపై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. దీంతో ఆయ‌న్ను సస్పెండ్‌ చేశారు. 

ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు  మళ్లీ  విశాఖలో ప్రత్యక్షమయ్యారు. రోడ్డుపై పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సుధాకర్‌ మానసిక పరిస్థితి సరిగా లేదని కేజీహెచ్‌ వైద్యులు చెప్పడంతో.. పోలీసులు ప్రభుత్వ మెంటల్ ఆస్పత్రికి తరలించారు.

విశాఖ‌లో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ప్ర‌సంగం విన్న వాళ్లెవ‌రికైనా డాక్ట‌ర్ సుధాక‌ర్ గుర్తు రాక మాన‌రు. ఎందుకంటే డాక్ట‌ర్ సుధాక‌ర్ మురిసిపోయేలా, ఆయ‌న్ను మ‌రిపించేలా లోకేశ్ విశాఖ‌లో జీవీఎంసీ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని అద్భు తంగా నిర్వ‌హించారు. ఏ మాట‌కామాట చెప్పాలంటే …లోకేశ్ నోటి నుంచి వెలువ‌డిన ప్ర‌తి మాట ఆణిముత్య‌మే. లోకేశ్ ప్ర‌సంగం విని డాక్ట‌ర్ సుధాక‌ర్ త‌న‌ను మించిపోయాడ‌ని ఎంత సంబ‌ర‌ప‌డి ఉంటారో మాట‌ల్లో చెప్ప‌లేం.

‘ఒక్క చాన్స్‌… ఒక్క చాన్స్‌ అని అడిగాడని ఓటేస్తే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేశాడు. రెండోసారి అవకాశం ఇస్తే విశాఖపట్నాన్నే అమ్మేస్తాడు. తర్వాత‌ రాష్ట్రాన్ని అమ్మేస్తాడు. జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు విశాఖ నగర ప్రజలు అంగీకరించినట్టే. ఇప్పుడు చేస్తున్న పోరాటాలన్నీ వృథా అవుతాయి. భవిష్యత్తు తరాల వారికి ఉపాధి అవకాశాలు పోతాయి’ లోకేశ్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

అస‌లు జ‌గ‌న్‌కు ఓట్లేయ‌డానికి విశాఖ ఉక్కు క‌ర్మాగారానికి ఏంటి సంబంధం? విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని అమ్మేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్న కేంద్ర ప్ర‌భుత్వాన్ని, బీజేపీని మాట మాత్రం కూడా విమ‌ర్శించ‌కుండా, సంబంధం లేని జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ‌డం డాక్ట‌ర్ సుధాక‌ర్ మ‌న‌స్త‌త్వం ఉన్న వాళ్ల‌కు త‌ప్ప‌, మ‌రో ర‌క‌మైన వ్య‌క్తుల‌కు సాధ్య‌మ‌య్యేది కాదు. రాష్ట్రాన్ని జ‌గ‌న్ అమ్మేయ‌డానికి గ‌త ఐదేళ్ల‌లో ఏం మిగిల్చారో లోకేశ్ చెబితే తెలుసుకుంటాం.

‘సీఎం జగన్‌ పెట్రోల్, డీజిల్‌ ధరలను ఇష్టానుసారంగా పెంచుతూ ప్రజలపై తీవ్ర భారాన్ని మోపుతున్నారు’ అని లోకేశ్ విమ‌ర్శించారు. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అయిన  లోకేశ్‌కు పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెంపు అధికారం ఎవ‌రి చేతుల్లో ఉంటుందో తెలియ‌దా? ఏమీ తెలియ‌కుండానే మంత్రిగా ప‌ని చేశారా?

మ‌రీ ప్ర‌త్య‌ర్థుల‌పై పొంత‌న లేని విమ‌ర్శ‌లు చేయ‌డం వ‌ల్లే … నిజంగా సంబంధం ఉంద‌ని చెప్పినా న‌మ్మ‌లేని దుస్థితికి తండ్రీకొడుకులు తీసుకొచ్చార‌నే అభిప్రాయాలున్నాయి.  ఏది ఏమైనా డాక్ట‌ర్ సుధాక‌ర్‌ను మ‌రోసారి అంద‌రికీ గుర్తు వ‌చ్చేలా చేసిన లోకేశ్ అభినంద‌నీయుడు.  

రైతు గొప్పతనమే ఇతివృత్తంగా శ్రీకారం సినిమా

ఆర్కే నాయుడు క్యారెక్ట‌ర్ ని ఎవ‌రూ రీప్లేస్ చేయ‌లేరు