ఈసారి కూడా మాఫియా డాన్ పాత్రే..!

కబాలి తర్వాత మరోసారి పా రంజిత్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు రజనీకాంత్. ఈనెల 28 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. కబాలికి సీక్వెల్ గా ఇది రాబోతోందని వచ్చిన…

కబాలి తర్వాత మరోసారి పా రంజిత్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు రజనీకాంత్. ఈనెల 28 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. కబాలికి సీక్వెల్ గా ఇది రాబోతోందని వచ్చిన కథనాల్ని యూనిట్ ఖండించింది. అయితే రజనీకాంత్ మాత్రం మాఫియా డాన్ గానే కనిపిస్తారని అంటోంది.

కబాలి సినిమాలో మాఫియాను ఎదుర్కొని తను కూడా డాన్ గా మారతాడు రజనీకాంత్. ఈ కొత్త సినిమాలో కూడా డాన్ గానే కనిపించబోతున్నాడు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒకప్పటి ముంబయి మాఫియా డాన్ హజి మస్తాన్ దత్తపుత్రుడు యూనిట్ కు నోటీసులు పంపించాడు. తన తండ్రిని నెగెటివ్ గా చూపించవద్దని అందులో డిమాండ్ చేశాడు. 

నోటీసుకు స్పందించిన సినిమా యూనిట్.. కొత్త సినిమాలో రజనీకాంత్ మాఫియా డాన్ గా కనిపిస్తాడని ప్రకటించింది. అయితే హజి మస్తాన్ కు రజనీపాత్రకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టంచేసింది. కేవలం ఇది కల్పిత పాత్ర అని తెలిపింది. సినిమా యూనిట్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ తో రజనీకాంత్ మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడనే వార్త నిజమైంది. రజనీ అల్లుడు ధనుష్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.