ఇదెక్కడి చోద్యం మురళీ మోహనా?

చిన్నపుడు ఎవర్నయినా ఏమవుతావు అని అడిగితే టీచర్ అవుతా, లేదా డాక్టర్ అవుతా అంటూ ఇలా చెబుతారు. అంతే కానీ ఎమ్మెల్యే కావాలని, ఎంపీ కావాలని చెప్పేవాళ్లు తక్కువ. అలాంటిది చిన్నప్పటి నుంచే తనకు…

చిన్నపుడు ఎవర్నయినా ఏమవుతావు అని అడిగితే టీచర్ అవుతా, లేదా డాక్టర్ అవుతా అంటూ ఇలా చెబుతారు. అంతే కానీ ఎమ్మెల్యే కావాలని, ఎంపీ కావాలని చెప్పేవాళ్లు తక్కువ. అలాంటిది చిన్నప్పటి నుంచే తనకు టీటీడీ చైర్మన్ కావాలని వుందని చెప్పడం అంటే ఏమనుకోవాలి? పైగా టీటీడీ చైర్మన్ గిరీ అన్నది క్రేజీ గా మారి మహా అయితే పాతిక ముఫై ఏళ్లు అయి వుంటుందేమో? కానీ మురళీ మోహన్ పుట్టింది 1940లో. మరి అలాంటిది తనకు చిన్నప్పటి నుంచీ చైర్మన్ పదవిపై ఆసక్తి వుందని చెప్పడం ఏమిటో?

పైగా తనకు చిన్నప్పటి నుంచి దైవ భక్తి ఎక్కువ అని, అందుకే టీటీడీ చైర్మన్ పదవి పై ఆసక్తి వుందని చెప్పారు. ఈ దేశంలో దైవ భక్తి లేని వాళ్ల సంఖ్య చాలా తక్కువ. అందునా తిరుపతి వెంకన్న భక్తులు కోట్లలో వుంటారు. వాళ్లందరికీ తిరుపతి వెంకన్న పై భక్తి కానీ, టీటీడీ చైర్మన్ పై భక్తి కాదు. మురళీ మోహన్ కు మాత్రం దేవుడిపై భక్తి కన్నా, టీటీడీ చైర్మన్ పై భక్తి పెంచుకున్నట్లు కనిపిస్తోంది.