త్రిభాషా చిత్రంగా ఉయ్యాలవాడ

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా స్థాయిని కొత్త పుంతలు తొక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆరంభంలో జస్ట్ ఓ మీడియం బడ్జెట్ తో చేద్దామనుకున్నవారు, ఇప్పుడు రూట్ మార్చుకున్నారు. ఓ ప్రాంతీయ యోధుడైనా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎదిరించింది…

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా స్థాయిని కొత్త పుంతలు తొక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆరంభంలో జస్ట్ ఓ మీడియం బడ్జెట్ తో చేద్దామనుకున్నవారు, ఇప్పుడు రూట్ మార్చుకున్నారు. ఓ ప్రాంతీయ యోధుడైనా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎదిరించింది బ్రిటిష్ పాలకులను. అందువల్ల ఈ కథకు జాతీయస్థాయి లుక్ వచ్చేలా మెరుగులు దిద్దుతున్నారు. అదేసమయంలో విఎఫ్ఎక్స్, ఇతర గ్రాఫిక్స్ కాస్త హై స్టాండర్డ్ లో వుండేలా ప్లాన్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో ఈ సినిమా బడ్జెట్ కూడా వంద కోట్ల రేంజ్ కు చేరుకుంటోంది.

అందువల్ల ఈ సినిమాను, తమిళ, హిందీ భాషల్లోకి కూడా తీసుకెళ్తారు. దీనివల్ల బడ్జెట్ కు, మార్కెట్ కు వెసులుబాటు కలుగుతుంది. అదే సమయంలో అక్కడి ప్రేక్షకులకు కూడా ఆసక్తి కలిగేలా, కాస్త పేరున్న ఆయా భాషల నటులను తీసుకోవాలని కాస్టింగ్ డిస్కషన్ చేస్తున్నారు. ఇప్పటికే ఐశ్వర్య రాయ్ పేరు వినిపిస్తోంది. తమిళ, హిందీ క్యారెక్టర్ ఏక్టర్ల నుంచి జనాల్లో క్రేజ్ వున్నవారిని కీలక పాత్రలకు ఎంపిక చేయాలని చూస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా మంచి వసూళ్లే సాధించింది. ఆ సినిమా అంటే ఎలా వుంటుందో ప్రేక్షకుల స్పందన తెలియని నేపథ్యంలో చేసారు. ఇప్పుడు వంద కోట్ల వరకు స్పందన వుంటుంది అని క్లియర్ అయింది కనుక, ధైర్యంగా ఖర్చు పెట్టడానికి ముందుకు వెళ్తున్నారు. పైగా బాహుబలి తరువాత తెలుగుసినిమాల మీద నార్త్ జనాలకు కాస్త ఆసక్తి పెరిగిందని భావిస్తున్నారు. అందుకే ఉయ్యాల వాడ కూడా భారీ సినిమాగా మారబోతోంది. మొత్తం మీద బాహుబలి ఎఫెక్ట్ తెలుగు సినిమాల మీద బాగానే పడుతున్నట్లుంది.