అవును.. సెక్స్‌లో ఫిమేల్ పార్ట్‌నర్ సంతృప్తి పరచాలంటే… మీరు శృంగార గ్రంధ సారంగులు కానక్కర్లేదు, కామసూత్రాలు పాటించనక్కర్లేదు, తెగ కష్టపడిపోనక్కర్లేదు, వయాగ్రాల.. మరోరకమైన ఉత్ప్రేరకాల అవసరంలేదు.. ఒక్కమాట చాలు.. అని అంటున్నారు పరిశోధకులు. ఒక్కమాట, ఒకేమాట.. అదొక మంత్రంలా ఆమెను సంతృప్తి పరుస్తుంది, బెడ్ మీద మిమ్మల్ని ఛాంపియన్‌గా నిలుపుతుంది.. అని వీరు చెబుతున్నారు.
ఇంతకీ మంత్రంలాంటి ఆ మాటేమిటంటే.. 'ఐ లవ్ యూ..'. అవును.. ఈ మాట బెడ్ మీద కూడా చాలా ప్రభావవంతమైనదని శాస్త్రీయమైన అధ్యయనాలు చెబుతున్నాయి. ఎంతలా.. అంటే, తమ శృంగార జీవితంలో సంతృప్తిగా ఉన్నామని చెబుతున్న మహిళల్లో డెబ్బైఐదు శాతం మంది.. బెడ్ మీద తమ మేల్ పార్ట్‌నర్ ప్రతిసారీ 'ఐ లవ్ యూ' చెబుతాడు.. అని చెప్పారట!
అంటే సెక్సువల్ లైఫ్ ఆనందకరంగా కలిగిన వారందరికీ మగాడు బెడ్ మీద మాటలతో కూడా ప్రేమను వ్యక్తీకరించడాన్ని మరవడంలేదు. అలా వ్యక్తీకరించడం స్త్రీ లైంగికానందాన్ని పతాక స్థాయికి తీసుకెళుతోంది. మరి భాగస్వామిని శారీరకంగా తృప్తి పరచాలనే ఆకాంక్షతో ఉన్నవారు.. ఈ కిటుకును ఫాలోకావడం ఉత్తమం అని శృంగార శాస్త్ర అధ్యయనకర్తలు చెబుతున్నారు.
భారత్ వంటి సమాజంలో అయితే చాలామంది భార్యలు భర్త నుంచి ఐ లవ్ యూ అనే మాటను ఆశిస్తూనే ఉంటారు. మొక్కుబడిగా అయినా చెప్పడానికి వెనుకాడే వాళ్లు ఎంతో మంది. అలాంటి వారి విషయంలో అయితే.. మనస్ఫూర్తిగా చెబితే వారి ఆనందం వెలకట్టలేనిదే అవుతుందని అధ్యయనకర్తలు వివరించారు. మరి వ్యక్తీకరించడం ఎలా అంటే.. రతి కార్యంలో మూలుగులా ఆమెను చెవిన ఐ లవ్ యూ చెప్పడానికి మించిన రొమాన్స్ లేదని అంటున్నారు!