సమంత సినిమాలో పెళ్లిచూపులు హీరో

పెళ్లిచూపులు సినిమాతో ఫేం తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేశాడు. అదే మహానటి. అలనాటి మేటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలోకి విజయ్…

పెళ్లిచూపులు సినిమాతో ఫేం తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేశాడు. అదే మహానటి. అలనాటి మేటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలోకి విజయ్ దేవరకొండను తీసుకున్నారు. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోషించబోయే పాత్ర ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

మహానటి సినిమాలో సావిత్రి పాత్రను కీర్తిసురేష్ పోషించనుంది. సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో “ఓకే బంగారం” ఫేం దుల్కర్ సల్మాన్ కనిపించనున్నాడు. ఇక సినిమాలో జర్నలిస్ట్ గా కనిపించనుంది సావిత్రి. ప్రస్తుతానికైతే ఈ 3 పాత్రలు ఫిక్స్ అయ్యాయి. అనుష్క కూడా ఓ చిన్న క్యారెక్టర్ చేయనుందని టాక్.

తాజాగా విజయ్ దేవరకొండ రాకతో మహానటి తారాగణం మరింత పెరిగింది. కేవలం విజయ్ దేవరకొండతో మాత్రమే ఇది ఆగట్లేదు. మరింతమంది హీరోహీరోయిన్లు ఇందులో కనిపిస్తారని తెలుస్తోంది. కథ ప్రకారం, అలనాటి నటీనటులు చాలామందిని తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నాడట దర్శకుడు నాగ్ అశ్విన్. సో.. ఫ్యూచర్ లో ఇంకెంతమంది స్టార్లు ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ అవుతారో చూడాలి.