బాహుబలి-2 తెలుగు రాష్ట్రాల్లో లాభాల బాట పట్టింది. ఈ సినిమా అమ్మకాలు 130 కోట్ల మేరకు సాగినపుడు ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోయాయి. ఆ లెక్కన 150 దగ్గరగా వస్తే తప్ప, ఖర్చులు కిట్టవని లెక్కలు కట్టారు. వడ్డీల సంగతి ఆ తరువాత. అయితే కొన్నవాళ్లు గట్టి నమ్మకంతో కొన్నారు.
ఇప్పుడు అందరి అంచనాల కన్నా, వారి నమ్మకాలే గెలిచాయి. దాదాపు అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ దశను దాటి లాభాల బాటపట్టాయి. ఈ వారం కూడా కాస్త కలెక్షన్లు కళ్ల చూస్తే, బయ్యర్లు మంచి లాభాలు కళ్ల చూస్తారు.
అన్నింటి కన్నా ఉత్తరాంధ్ర ముందుగా బ్రేక్ ఈవెన్ అయినట్లే, లాభాలు కూడా అక్కడే ఎక్కువ వచ్చాయి. అదే విధంగా చివర్న బ్రేక్ ఈవెన్ అయ్యేది సీడెడ్ అని ముందే అర్థం అయిపోయింది. అలాగే జరిగింది. అక్కడ ఇంకా లాభాల బాట ప్రారంభం కాలేదు. ఈస్ట్, వెస్ట్ కలిపి కొన్నారు, ఆ లెక్కన చూసుకుంటే, జస్ట్ బ్రేక్ ఈవెన్ అయినట్లు.
గుంటూరు, నెల్లూరుల్లో లాభాలు ప్రారంభమయ్యాయి. కృష్ణ స్టార్ట్ కావాలి. భారీ సంఖ్య అయిన నైజాంలో బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు లాభాలు స్టార్ట్ కావడం విశేషం. పైగా హైదరాబాద్ నగర పరిథిలో బాహుబలి ఊపు ఇంకా తగ్గలేదు కాబట్టి, ఇక్కడ మంచి ఫిగర్ నమోదు అయ్యే అవకాశం వుంది.
నైజాం – 53.60
సీడెడ్ – 27.65
ఉత్తరాంధ్ర – 21.20
గుంటూరు – 14.79
ఈస్ట్ – 14.60
వెస్ట్ – 10.66
కృష్ణ – 11.29
నెల్లూరు – 6.01
మొత్తం – 159.80