ఆంజనేయుడుగా సంపూ

రక్షకభటుడు సినిమాకు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. పోలీస్ యూనిఫారమ్ లో వున్న ఆంజనేయుడ్నిని వెనక నుంచి చూపిస్తున్నారు. ఆ పాత్రను ఎవరు పోషించారో అన్నది ఇప్పటి దాకా రివీల్ చేయలేదు. సినిమా క్లయిమాక్స్ లో…

రక్షకభటుడు సినిమాకు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. పోలీస్ యూనిఫారమ్ లో వున్న ఆంజనేయుడ్నిని వెనక నుంచి చూపిస్తున్నారు. ఆ పాత్రను ఎవరు పోషించారో అన్నది ఇప్పటి దాకా రివీల్ చేయలేదు. సినిమా క్లయిమాక్స్ లో వచ్చే ఆ సన్నివేశం సినిమాకు కీలకంగా వుంటుందని మాత్రమే చెబుతున్నారు. ఓ హీరో ఆ పాత్ర పోషించాడంటున్నారు.

అయితే ఆ హీరో మరెవరో కాదని, సంపూర్ణేష్ బాబే అని తెలుస్తోంది. రక్షక భటుడిగా ఆంజనేయుడి గెటప్ లో సంపూ క్లయిమాక్స్ లో కనిపిస్తాడు. ఆ తరువాత నిజం ఆంజనేయడు ప్రత్యక్షమవుతాడు. ఆ సీన్లన్నీ విఎఫ్ఎక్స్ లో తయారుచేయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఈనెల 12న విడుదలవుతోంది. ఆకెళ్ల వంశీ కృష్ణ దర్శకుడు. 

సంపూ నటించిన మరో సినిమా కొబ్బరి మట్ట కూడా వచ్చేనెలలో విడుదలవుతోంది. ఈ సినిమాలో సంపూ మూడు క్యారెక్టర్ లు పోషిస్తున్నాడు. ప్రధాన పాత్ర అయిన పెదరాయుడికి ఏడుగురు భార్యలు, బోలెడు మంది పిల్లలు, మరింత మంది మనవులు వుంటారట. 

మొత్తానికి సంపూ కోసం వెరైటీ పాత్రలే తయారుచేస్తున్నారు దర్శకులు.