బన్నీకి భాగస్వామ్యంగా వుందని చెప్పుకునే హైదరాబాద్ హైలైఫ్ పబ్ (జూబ్లీ800)లో నిన్నటి నిన్న కుర్ర స్టార్లంతా సందడి చేసారు. అప్పుడప్పుడు సాయంత్రాలు పబ్ ల్లో గడపడం అన్నది యంగ్ స్టార్లందరికీ కామన్ కదా. అందుకే మెగా హీరోలు సాయి ధరమ్ తేజ, వరుణ్ తేజ, అల్లు శిరీష్, వీళ్లకు తోడుగా సందీప్ కిషన్, అక్కినేని సుమంత్ తదితరులు వెళ్లారు.
రాశీఖన్నా, రెజీనా జోడీలుగా వచ్చేసారు. రానా కూడా వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలో హల్ చల్ అంతా రెజీనాదే అని వినికిడి. హీరోలందరిని ఆటపట్టిస్తూ, వాళ్లతో కలిసి జోక్ లు పేలుస్తూ, అక్కడ వున్నవారి దృష్టిని రెజీనా బాగా ఆకట్టేసుకుంది. అటు సందీప్ కిషన్, ఇటు సుమంత్, మరోపక్క సాయి ధరమ్ ఇలా ఎవర్నీ వదల్లేదట రెజీనా. మొత్తానికి కుర్ర స్టార్లంతా సమ్మర్ సాయంత్రాలు బాగానే ఎంజాయ్ చేస్తున్నారన్నామాట.