రారండోయ్ వేడుక చూద్దాం సినిమా మీద బోలెడు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయ్. ముఖ్యంగా ఈ సినిమాను డైరక్టర్ కళ్యాణ్ కృష్ణకు వదిలేసి, తాను వేరే విధంగా బిజీ అయిపోవడం మైనస్ అయిందని, సినిమా బాగా రాకపోవడంతో ఇప్పుడు నాగ్ కిందా మీదా అవుతున్నాడన్నది కీలకం. ఈ మధ్యనే నిర్మాత రామ్ మోహన్ దగ్గర వుంటూ, అతని సినిమాలకు పనిచేసిన ఓ వ్యక్తిని కూడా ఈ సినిమా రిపేర్లకు జోడించాడని అంటున్నారు. లైన్ బాగుండడంతో అంతా డైరక్టర్ కళ్యాణ్ కృష్ణకు వదిలేసారు. కానీ ఇప్పుడు అవుట్ పుట్ బాగాలేదని నాగ్ ఫీలవుతున్నట్లు సమాచారం.
మరి ఇదే డైరక్టర్ తో బంగార్రాజు సినిమా చేయాలని నాగ్ ముందే డిసైడ్ అయ్యారు. సోగ్గాడే చిన్ని నాయనాలో బంగార్రాజు క్యారెక్టర్ కు ఎక్స్ టెన్షన్ ఇది. రాజు గారి గది తరువాత ఆ సినిమా చేయాలనే, చందుమొండేటి సినిమాను కూడా వాయిదా వేసాడు. అతనికి నాగ్ చైతన్య సినిమా అప్పగించాడు. మరి ఇప్పుడు బంగార్రాజు స్క్రిప్ట్ ఎలా పూర్తయిందో లేదో? ఇదంతా రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఫలితం మీదే ఆధారపడి వుండేలా వుంది. ఏమైనా తెలుగు సినిమా డైరక్టర్లలో చాలా మందికి రెండో సినిమా గండమే.