అక్కడ కూడా రాజమౌళి కొడుకు

బాహుబలి సినిమా మేకింగ్ లో రాజమౌళి కొడుకు కార్తికేయ పాత్ర ఎంత వుందో అందరికీ తెలిసిందే. సెకెండ్ యూనిట్ డైరక్టర్ గా టైటిల్ కార్డే పడింది. సినిమాల సంగతి అలా వుంచితే కార్తికేయకు బయట…

బాహుబలి సినిమా మేకింగ్ లో రాజమౌళి కొడుకు కార్తికేయ పాత్ర ఎంత వుందో అందరికీ తెలిసిందే. సెకెండ్ యూనిట్ డైరక్టర్ గా టైటిల్ కార్డే పడింది. సినిమాల సంగతి అలా వుంచితే కార్తికేయకు బయట అంతకు ముందు వేరే వ్యాపారాలు వున్నాయి. పెయిడ్ గెస్ట్ హవుస్ నిర్వహణ, సినిమాకు సంబంధించిన ట్రయిలర్ లు కట్ చేయడం, మేకింగ్ విడియోలు చేయడం లాంటివి వున్నాయి.

అయితే బాహుబలి 2తో మరో బిజినెస్ లోకి కూడా కార్తికేయ ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. ఆ సినిమా సీడెడ్ హక్కులలో కార్తికేయకు 40 శాతం వాటా వున్నట్లు తెలుస్తోంది. సాయి కొర్రపాటి, ఎన్వీప్రసాద్ లతో కలిసి కార్తికేయ సీడెడ్ లో బాహుబలి 2ను విడుదల చేసారు. అక్కడ కూడా మంచి షేర్ నే వస్తోంది. ఇప్పటికి 19 కోట్లకు పైగా వచ్చింది. మరో పది, పదకొండుకోట్ల వరకు రావాల్సి వుంది.