యధా రాజా తధా పోలీస్‌

రాజులు ఎఫిషిఎంట్‌ అయితే ఆయన భటులూ ఎఫిషియెంట్‌గానే ఉంటారు. చిల్లర్‌ టైప్‌ అయితే ఆయన భటులూ చిల్లర్‌గానే ఉంటారు. ఎవడో ఒక బందిపోటు నాయకుడు మాట్లాడితే రాజ్యంలో ప్రజల్ని కొల్లగొడుతూ తప్పించుకు పారిపోతూవుంటే ఆ…

రాజులు ఎఫిషిఎంట్‌ అయితే ఆయన భటులూ ఎఫిషియెంట్‌గానే ఉంటారు. చిల్లర్‌ టైప్‌ అయితే ఆయన భటులూ చిల్లర్‌గానే ఉంటారు. ఎవడో ఒక బందిపోటు నాయకుడు మాట్లాడితే రాజ్యంలో ప్రజల్ని కొల్లగొడుతూ తప్పించుకు పారిపోతూవుంటే ఆ ఎఫెక్ట్‌ రాజు మీద పడుతుంది కదా? దాంతో ఆయనకు కోపమొచ్చి ఫలానా బందిపోటు నాయకుడి తలను తెచ్చి ఇచ్చిన వాడికి బహుమతి ఇస్తా అని ప్రకటన చేస్తాడు. ఆ ప్రకటనతో రాజ్యంలో ఉన్నా వీరులందరూ కత్తి కటారులతో వెళ్లి ఆ బందిపోటుని సంహరించి వాడి తలను తెచ్చి రాజుగారి ముందు పెడతాడు. రాజుగారు హాపీగా ఫీలయ్యి ఆ వీరుడికి బహుమతి ఇస్తాడు. ఇది నార్మల్‌ ప్రొసీజర్‌ ఆ రోజుల్లో. అయితే ఆ పద్ధతే ఇప్పటికీ మన దేశంలో అన్ని ప్రభుత్వాలూ ఫాలో అవుతున్నాయ్‌.  

అదెలా అంటే….

ఫలానా వీరప్పన్‌ లేదా చెల్లప్పన్‌ అనే బందిపోటుని ప్రాణాలతో లేదా వాడి డెడ్‌బాడీని తీసుకొచ్చిన వాడికి ఇన్ని లక్షలు బహుమతి.. 

ఫలానా నక్షలైట్‌ని సజీవంగా లేదా వాడి డెడ్‌బాడీని తెచ్చిన వాడికి ఇంత కాష్‌ రివార్డ్‌ ఇస్తాం.. అని ప్రభుత్వమే ప్రకటనలు ఇస్తోంది.

అది చూసి చిల్లర్‌ రాజకీయ నాయకులు కూడా మహారాజుల్లాగా రివార్డ్‌ ప్రకటించటం మొదలు పెట్టారు.

మా పార్టీకి ప్రధాన ప్రతిపక్షక నాయకుడి తలతెచ్చి ఇచ్చిన వారికి 30 లక్షలు బహుమతి.. మా పార్టీతో విబేధించిన ఫలానా రాకేశ్‌ గాడిని 48 గంటల్లో లేపేసిన వాడికి కోటి రూపాయలు.. అంటూ మనకు టీవీ ఛానల్స్‌లో ప్రకటనలు కనబడుతున్నాయ్‌. అయినా పోలీసులు అలాంటి వాళ్ళను అరెస్ట్‌ చేయరు. కేసులు కూడా పెట్టరు. ఎందుకంటే రాజులు ఏమి చెప్తే భటులు అది నోరుమూసుకుని శిరసావహించాలని వాళ్లకు తెలుసు.. అదే పోలీసులు మామూలు ప్రజల విషయంలో అయితే రెచ్చిపోయి అరెస్ట్‌లు చేసేస్తారు.

ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి ఫలానా వ్యక్తిని హత్య చేయమని ఫలానా శంకర్‌గాడు ఒక గూండాతో ఒప్పందం చేసుకున్నట్లు మాకు ఇన్షర్మేషన్‌ వచ్చింది. వెంటనే ఆ గూండాను అరెస్ట్‌ చేస్తే ఆ విషయం నిజమేనని ఒప్పుకున్నాడు. అందుకని ఆ గూండానీ, ఆ శంకర్‌గాడినీ 78 రకాల సెక్షన్ల కింద అరెస్ట్‌ చేయడం జరిగింది అంటూ హడావుడి చేస్తారు.

ఆ మాటే పోలీసులను అడిగారనుకోండి.. రాజకీయ నాయకులు వేరు.. ప్రజలు వేరు సార్‌.. రాజకీయనాయకులు ఇవాళ పదవిలో లేకున్నా రేపు మా మీదే హోమ్‌ మినిస్టర్‌ అవ్వచ్చు. అలాంటి వాడి మీద కేసులు ఎలాపెడతాం? అనే జవాబు వస్తుంది.

ఇలాంటివి ఇలాగే పట్టించుకోకుండా వదిలేసారనుకోండి. ఫ్యూచర్లో పరిస్థితి ఇలా వుంటుంది.

నాకు పదేళ్ళు జైలుశిక్ష వేసిన ఫలానా జడ్జీని ప్రాణాలతో గాని విగతజీవిగా గాని తెచ్చి ఇచ్చిన వారికి కోటి రూపాయల బహుమతి.. వ్యాపారంలో నన్ను మోసం చేసిన రమేష్‌ గాడిని నరికేసిన వాడికి పదికోట్లు బహుమతి.. నాకు ఉద్యోగం ఇవ్వకుండా వేరేవాడికి ఉద్యోగం ఇచ్చిన ఫలానా కంపెనీ ఎండీని లేపేసిన వాడికి 50 లక్షల రివార్డ్‌.. 

నన్ను ప్రేమించకుండా ఆ విజయ్‌ గాడిని ప్రేమించిన శిరీషను లేపేసిన వాడికి అయిదు కోట్ల బహుమతి.. ఆస్తి వివాదాల్లో నాకు శత్రువు అయిన మా తమ్ముడిని నెలరోజుల్లో లేపేసిన వాడికి ఆస్తిలో సగం వాటా..

(సరదాకు మాత్రమే ఇతర ఉద్యేశాలు లేవని మనవి)
-యర్రంశెట్టి సాయి