మళ్లీ అదే తప్పు చేస్తున్నారా?

వ్యాపారం వ్యాపారంలా చేయాలి, యుద్ధం యుద్దంలా చేయాలన్నది ఓ కొటేషన్. జాలి, దయ లాంటివి పనికి రావు. అందునా సినిమా రంగంలో అసలు పనికి రావు. అయ్యో మంచి డైరక్టర్, ఇప్పుడు ఫామ్ లో…

వ్యాపారం వ్యాపారంలా చేయాలి, యుద్ధం యుద్దంలా చేయాలన్నది ఓ కొటేషన్. జాలి, దయ లాంటివి పనికి రావు. అందునా సినిమా రంగంలో అసలు పనికి రావు. అయ్యో మంచి డైరక్టర్, ఇప్పుడు ఫామ్ లో లేకపోతేనేం ఓ అవకాశం ఇచ్చి ఆదుకుందాం అనుకుంటే, వేళ్లు కాదు, కోట్లు కాలిపోతాయి. సాధారణంగా సినిమా జనాలు కాస్త జాగ్రత్తగానే వుంటారు. అయితే ఠాగూర్ మధు, సాయి కొర్రపాటి లాంటి వాళ్లకు కాస్త అభిమానాలు, జాలి లాంటి వ్యవహారాలున్నాయి.

అందుకే త్రికోటి, చంద్రశేఖర్ యేలేటి, శ్రీను వైట్ల లాంటి వాళ్లకు ఫామ్ లో లేకపోయినా అవకాశాలు ఇచ్చి కోట్ల మేరకు దెబ్బలు తిన్నారు. అయ్యో నమ్మి అవకాశం ఇచ్చారు, ప్రూవ్ చేసుకుందాం అని శ్రీను వైట్ల అనుకుని వుంటే మిస్టర్ సినిమా అలా మిస్ ఫైర్ అయ్యేది కాదు. పది కోట్ల మేరకు నష్టాలు మిగిల్చేది కాదు.

అయిందేదో అయిపోయింది. కానీ టాగోర్ మధు మళ్లీ అలాంటి నిర్ణయమే ఒకటి తీసుకున్నారని ఇండస్ట్రీలో వినవస్తోంది. ఫ్లాపులే లైన్ లో వున్న డైరక్టర్ దశరథ్ కు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారట. అది కూడా శర్వానంద్ లాంటి యంగ్ హీరోతో. ఇవ్వాళ కుర్రాళ్లు మాంచి యూత్ ఫిల్మ్ లు చూడాలనుకుంటున్నారు. కొత్తగా టేకింగ్ వుండాలనుకుంటున్నారు. ఫ్యామిలీ టచ్ లైక్ చేయడం వరకు ఓకె. కానీ ఈ విషయాలు కూడా కీలకమే. ఆ విధంగా చూసుకుంటే దశరథ్ లాంటి వాళ్లు కాంటెంపరరీ సినిమాలు ఏ మేరకు తీయగలరు అన్నది అనుమానం.

లైన్ బాగుంటే సరిపోదు. ఎగ్జిక్యూషన్ కొత్తగా వుండాలి కదా ? మంచు మనోజ్ తో శౌర్య అంటూ దశరద్ తీసి పెట్టిన సినిమా దెబ్బకు ఆ నిర్మాత ఇంకా కోలుకోలేదు. మరి తెలిసీ ఠాగూర్ మధు ఈ రిస్క్ ఎందుకు తీసుకుంటున్నట్లో?