రాజమౌళి లాంటి డైరక్టర్లు మాంచి పెర్ ఫెక్షనిస్టులు అంటే ఇష్టపడతారు. పని వచ్చిన వారే వాళ్లకు కావాలి. బాహుబలి-2కి పనిచేసినవారంతా అలాంటి లబ్ద ప్రతిష్టులే. కానీ ఒక్కరే ఎందుకో రాజమౌళికి సెట్ కాలేదు. అది కూడా సాదా సీదా వ్యక్తికాదు. చేసిన ప్రతి సినిమాకు శహభాష్ అని అనిపించుకున్న వ్యక్తి. అతనే రైటర్ బుర్రా సాయిమాధవ్.
రైటర్ బుర్రా సాయిమాధవ్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్నీ మంచి పేరు తెచ్చిపెట్టినవే. మాటల రచన విషయంలో అతనిస్థాయి అతనికి వుంది. కానీ ఎందుకో రాజమౌళికి మాత్రం సెట్ కాలేదని వినికిడి. ఎందుకంటే బాహుబలి కోసం రాజమౌళి, ఒకదశలో బుర్రా సాయిని కూడా కబురు చేసినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులు పని చేసినట్లు కూడా వినికిడి.
కానీ మరి అంతలోనే ఏం జరిగిందో బుర్రా మాత్రం బాహుబలి టీమ్ లో లేరు. బుర్రా స్టయిల్ హెవీ డైలాగ్ లు బాహుబలికి అవసరంలేదని అనుకున్నారేమో రాజమౌళి. ఎందుకంటే మరీ అద్భుతంగా క్లాప్ కొట్టేంతగా బాహుబలి రెండు భాగాల్లోనూ డైలాగులు ఏవీవుండవు. ఆ సినిమాకు అలా తేలికపాటి డైలాగులే వుండాలని అనుకున్నారేమో? బుర్రా డైలాగులు పడితే, అవి సీన్ ను డామినేట్ చేసేస్తాయి. బహుశా ఆ రీజన్ తోనే బుర్రాను వద్దనుకున్నారేమో? ఏ విషయమూ ఆ ఇద్దరికే తెలియాలి.