ఓ రేంజ్ కు రాగానే నాలుగు డబ్బులు చేసుకోవాలనుకోవడం ఎంతమాత్రం తప్పుకాదు. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి అది హీరోలకు చెల్లినంతంగా మిగిలిన వారికి నడవదు. రేట్లు పెంచితే మా సినిమాలో ఫలానా నటుడు వున్నాడు అని చెప్పుకోవడానికి చిన్నపాత్ర సృష్టించి, ఒకటి రెండు రోజులు పనిచేయించుకుని పంపేస్తారు. దీంతో సరైన పాత్రలు దొరక్క ఇబ్బంది అవుతుంది.
సప్తగిరి విషయంలో ఇదే జరిగింది. రోజుకు లక్షన్నర తీసుకోవడంతో, అరకొర పాత్రలు మాత్రం తయారుచేసి, ఒకటి రెండు రోజులు డబ్బులు ఇచ్చి కానిచ్చేసేవారు. దాంతో ఏ సినిమాలో కూడా సరైన పాత్ర చేసిన దాఖలాలు లేకుండా పోయాయి. ఈలోగా హీరోయిజం వైపు వెళ్లాడు. అదంతా వేరే సంగతి.
ఇప్పుడు వెన్నెల కిషోర్ వ్యవహారం కూడా ఇలాగే వుందట. ఆయన కూడా రోజుకు లక్షన్నర తీసుకోవడంతో, పాత్రల దగ్గర తేడా వస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇప్పటికి అయితే వెన్నెల కిషోర్ బిజీగానే వున్నాడు. కానీ ఈ రేటువల్ల చాలామంది చిన్న నిర్మాతలు వెన్నెల కిషోర్ ను అప్రోచ్ కాలేకపోతున్నారన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఆ మాటకు వస్తే ఖైదీ నెంబర్150లో సునీల్ మాదిరిగా వెన్నెల కిషోర్ పేరు వినిపించి మాయంకావడం వెనుక రీజన్ ఇదే అని కూడా టాక్ వుంది మరి.
కొంచెం రీజనబుల్ గా వుంటే వెన్నెల కిషోర్ మాంచి కమెడియన్ గా చాలాకాలం ఇండస్ట్రీలో వుండిపోయే అవకాశం వుంది.