కోటపై కక్ష కట్టిన దాసరి,చిరంజీవి

సినిమా రంగంలో కోటరీలు, గ్రూపులు, ఇంకా ఇంకా చాలా వ్యవహారాలు వుంటాయన్న సంగతి తెలిసిందే. అలాంటి వాటి దయాదాక్షిణ్యాల మీదనే అవకాశాలు కూడా ఆధారపడి వుంటాయి. ఈ విషయాన్నే మారోసారి చెప్పారు నటుడు కోటా…

సినిమా రంగంలో కోటరీలు, గ్రూపులు, ఇంకా ఇంకా చాలా వ్యవహారాలు వుంటాయన్న సంగతి తెలిసిందే. అలాంటి వాటి దయాదాక్షిణ్యాల మీదనే అవకాశాలు కూడా ఆధారపడి వుంటాయి. ఈ విషయాన్నే మారోసారి చెప్పారు నటుడు కోటా శ్రీనివాసరావు ఓ ఇంటర్వూలో. గతంలో ఎప్పుడో ఓసారి పరిశ్రమల సమస్యలపై దీక్షకు దిగారట. అది దర్శకుడు దాసరికి, చిరంజీవికి ఇష్టం లేకపోయిదంట.

‘వాడిని అక్కడ నుంచి లేపేయండి’ అని దాసరి హుకుం కూడా జారీ చేసారట. అయితే రామానాయుడు, శోభన్, రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ల మద్దతుతో దీక్ష కొనసాగిందట. చిరంజీవి కూడా కాస్త కినుక వహించారట. కట్ చేస్తే, దీక్ష ముగిసింది. ఆ తరువాత దాసరి, చిరంజీవి సినిమాల్లో కోటాకు చాన్స్ లు తగ్గిపోయాయట. అయితే రాజేంద్ర ప్రసాద్, శోభన్ తదితరులు ఎక్కువగా సినిమాలు చేయడంతో సమస్య లేకపోయిందట.

సినిమా రంగంలో దాసరి రింగ్ లీడర్, ఇలాంటి గ్రూపు వ్యవహారాలు  వుంటాయని అందరికీ తెలిసిందే. కానీ చిరంజీవి కూడా ఆ తాను ముక్కే అని అనుకోవాలి, కోటా వెల్లడించిన విషయం చూస్తుంటే.