బాలయ్య కోసం ఫారిన్ ఫైట్ మాస్టర్

పూరిజగన్నాధ్ సినిమా అంటే ఫారిన్ లోకేషన్ లో షూట్ వుండాల్సిందే. ఒక్కో సినిమాకు ఒక్కో లొకేషన్ ఎంచుకుంటారు. హీరో బాలకృష్ణతో తొలిసారి చేస్తున్న సినిమాకు ఆయన ఈసారి పోర్చుగల్ ను ఎన్నుకున్నారు. త్వరలో యూనిట్…

పూరిజగన్నాధ్ సినిమా అంటే ఫారిన్ లోకేషన్ లో షూట్ వుండాల్సిందే. ఒక్కో సినిమాకు ఒక్కో లొకేషన్ ఎంచుకుంటారు. హీరో బాలకృష్ణతో తొలిసారి చేస్తున్న సినిమాకు ఆయన ఈసారి పోర్చుగల్ ను ఎన్నుకున్నారు. త్వరలో యూనిట్ అంతా పోర్చుగల్ పయనమవుతోంది.

ఇప్పటికే యాభై శాతం షూట్ పూర్తి చేసిన ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. ఈ రోజు నుంచి హైదరాబాద్ లోనే ఓ పాట చిత్రీకరణ ప్రారంభించారు. గుండేల్లో గోళీ సోడా అనే మాస్ సాంగ్ ను బాలయ్య తదితరులపై చిత్రీకరిస్తారు. ఆ తరువాత సినిమా షూట్ పోర్చుగల్ కు షిఫ్ట్ అవుతుంది.

పోర్చుగల్ లో 40 రోజుల పాటు షెడ్యూలు వుంటుంది. ఆ షెడ్యూలులో మూడు పాటలు, ఫైట్లు, ఓ హెలికాప్టర్ ఛేజ్ వుంటాయి. ఇందుకోసం ఫ్రెంచ్ కు చెందిన ఓ ఫైట్ మాస్టర్ ను ఎంగేజ్ చేస్తున్నారు. ఈ విదేశీ ఫైట్ మాస్టర్ డైరక్షన్ లో ఫైట్లు, ఛేజ్ చిత్రీకరిస్తారు. ఆ తరువాత మళ్లీ హైదరాబాద్ లో 10 రోజుల వర్క్ తో సినిమా పూర్తవుతుంది. టోటల్ 90-100 రోజుల వర్కింగ్ డేస్. పూరిజగన్నాధ్ లాంటి డైరక్టర్ కు ఇది కాస్త ఎక్కువే అనుకోవాలి.