ఫ్లాప్ ను కవర్ చేసేందుకు ఫాస్ట్ గా వస్తున్నాడు

మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్లిన నాగార్జున స్పీడ్ కు బ్రేకులేసింది ఓం నమో వేంకటేశాయ సినిమా. మధ్యలో నిర్మలా కాన్వెంట్ వచ్చినప్పటికీ.. అందులో…

మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్లిన నాగార్జున స్పీడ్ కు బ్రేకులేసింది ఓం నమో వేంకటేశాయ సినిమా. మధ్యలో నిర్మలా కాన్వెంట్ వచ్చినప్పటికీ.. అందులో నాగార్జున హీరో కాడు. పోనీ దాన్ని కూడా కౌంట్ చేసుకున్నా అది కూడా ఫ్లాపే. ఇలా వరుసగా వచ్చిన ఫ్లాప్స్ ను కవర్ చేసేందుకు షార్ట్ గ్యాప్ లో మరో సినిమా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు నాగ్. అదే రాజుగారి గది-2.

ఫిబ్రవరి ఎండింగ్ లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే కంప్లీట్ అవుతుందట. ఈ నెలాఖరుకు సినిమాను పూర్తిచేసి, జులై 7న రాజుగారి గది-2ను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అంటే, ఓం నమో వేంకటేశాయ విడుదలైన 5 నెలలకే నాగార్జున మరో సినిమా రెడీ చేస్తున్నాడన్నమాట.

ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజుగారి గది-2 సినిమాలో సమంత, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాలో దెయ్యం లేదా ఆత్మగా కనిపించనుందట సమంత. హారర్-కామెడీ కాన్సెప్ట్ తో ఓ సినిమా చేయడం నాగార్జునకు కెరీర్ లో ఇదే ఫస్ట్ టైం. సినిమాలో మెంటలిస్ట్ క్యారెక్టర్ పోషిస్తున్న నాగ్, ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి. పీవీపీ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.