ఉభయుల అంగీకారంతో జరిగేదే సెక్స్. ఏ ఒక్కరు అంగీకరించకపోయినా అది సెక్సువల్ హెరాష్మెంట్ కిందకే వస్తుంది. అయితే సెక్స్ లో కూడా ఇప్పుడు కండిషన్స్ అప్లయ్ అంటున్నాయి కొన్ని విదేశీ స్వచ్ఛంద సంస్థలు. సెక్స్ మధ్యలో పార్టనర్ అనుమతి లేకుండా కండోమ్ తీసేసి సెక్స్ చేస్తే, దాన్ని కూడా లైంగిక వేధింపు కిందే
లెక్కకట్టాలని సూచిస్తున్నాయి.
పాశ్చాత్య దేశాల్లో ఈమధ్య కాలంలో ఈ కల్చర్ ఎక్కువైపోయింది. భాగస్వామికి తెలియకుండా సెక్స్ మధ్యలో కండోమ్ తీసేసి లైంగిక చర్యలో పాల్గొంటున్నారు చాలామంది. దీనికి అక్కడ స్టెల్తింగ్ అని పేరు పెట్టారు. ఇలా స్టెల్తింగ్ కు పాల్పడేవాళ్ల సంఖ్య ఈ మధ్యకాలంలో అనూహ్యంగా పెరిగిపోతోందని “కొలంబియా జర్నల్ ఆఫ్ జెండర్ అండ్ లా” తన నివేదికలో పేర్కొంది.
విదేశాల్లో విశృంఖలంగా పెరిగిపోతున్న స్టెల్తింగ్ ను నియంత్రించేందుకు సరైన చట్టాలు లేవని, ఈ మేరకు చట్టాల్లో మార్పులు చేయాలని సూచిస్తోంది సదరు నివేదిక. సెక్స్ మధ్యలో స్టెల్తింగ్ కు పాల్పడితే దాన్ని రేప్ కింద పరిగణించాలని సూచిస్తోంది.